
భారతదేశంలో టాప్ 10 ETF funds ఏమున్నాయో చూద్దాం.
6.ఇన్వెస్టర్లలో రోజు రోజుకూ పాపులర్ అవుతున్న ఫైనాన్షియల్ టూల్ ఏదైనా ఉందంటే… అది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) అని చెప్పొచ్చు. భారత్ లో టాప్ 10 ETF ఫండ్స్ గురించి చూస్తే గనుక
Top 10 ETF funds in india
1. నిప్పాన్ ఇండియా ETF నిఫ్టీ 50
ఈ ఫండ్ నిఫ్టీ 50 ఇండెక్స్ లోని అసెట్స్ లో పెట్టుబడులు పెడుతుంది. ఇండియా లో లార్జ్ క్యాప్ 50 కంపెనీలలో వాటి మార్కెట్ క్యాప్ ఆధారంగా ఆయా నిష్పత్తి లో ఆలకేట్ చేస్తుంది.
Benifits: అధిక లిక్విడిటీ, తక్కువ ట్రాకింగ్ ఎర్రర్, నిఫ్టీ 50 index కదలికల కనుగుణంగా ఈ ఫండ్ పని చేస్తుంది. తక్కువ రిస్క్ ను కోరుకునే మినిమం రిటర్న్స్ కోరుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది.
ఇండియా లో ETF funds ను మొదలు పెట్టిన ఫండ్ హౌస్ గా నిప్పాన్ ఇండియా ముందు వరసలో ఉంది. అంతే కాక మంచి మేనేజ్మెంట్ తో అధిక లాభాలు అందిస్తూ మదుపరుల నమ్మకాన్ని సంపాదించింది.
తక్కువ రిస్క్ తో పెట్టుబడుల ప్లానింగ్ చేసుకునే వారికి పెద్ద కంపెనీలలో ఒకే ఫండ్ ద్వారా 50 అసెట్స్ షేర్లు తీసుకునే అవకాశం ఈ ETF కల్పిస్తుంది.
2. ఎస్బీఐ ETF నిఫ్టీ 50
ఈ ETF కూడా నిఫ్టీ 50 సూచీని ఫాలో అవుతుంది.
ముందు చెప్పుకున్న విధంగానే sbi కూడా నిఫ్టీ 50 లోని కంపెనీలలో పెట్టుబడులు పెడుతుంది. ఇన్వెస్టర్లకు వారికి నచ్చిన ఏ ఫండ్ లోనైన ETF లను కొనుగోలు చెయ్యొచ్చు . పనితీరులో ఎటువంటి తేడా రాదు. ఎందుకంటే 50 కంపెనీల మార్కెట్ క్యాప్ ఆధారంగానే ఆలకేషన్ ఉంటుంది కాబట్టి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతిపెద్ద గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్ కాబట్టి ఇన్వెస్టర్లకు నమ్మకం ఎక్కువ.
3. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ నెక్స్ట్ 50 ETF
కంపెనీల మార్కెట్ క్యాప్ ఆధారంగా చూస్తే నిఫ్టీ 50 తరవాత ఉన్న 50 కంపెనీలను నిఫ్టీ నెక్స్ట్ 50 గా చెప్పొచ్చు. అంటే ఇండియా లో నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ లో ఉన్న టాప్ 100 కంపెనీలలో 50 లార్జ్ క్యాప్ అయితే మిగతా 50 మిడ్ క్యాప్ గా అనుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే.. రాబోయే రోజుల్లో లార్జ్ క్యాప్ కంపెనీలుగా మారటానికి అవకాశం ఉన్నవి గా భావించొచ్చు.
డైవర్సిఫైడ్ అసెట్స్: వివిధ కేటగిరీలకు చెందిన గ్రోత్ కంపెనీలు ఇందులో ఉంటాయి కనుక .. డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో వలన అధిక వృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పొచ్చు.
4. హెచ్డీఎఫ్సీ గోల్డ్ ETF
బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. ఫిజికల్ బంగారం కొనుగోలు చేసినట్లయితే దాన్ని దాచటానికి బ్యాంక్ లాకర్లు లాంటివి అవసరం. దొంగల భయం మరో కారణం. అదే ETF ల ద్వారా మార్కెట్ లో కొనుగోలు చేసినట్లయితే ఆ భయం అక్కరలేదు. పైగా పిల్లల పెళ్ళిళ్ళు లాంటి దీర్ఘకాల అవసరాల కోసం ఈ ETF లలో మదుపు చేసినట్లయితే పెరుగుతున్న బంగారానికి అనుగుణంగా మన పోర్ట్ ఫోలియో లో ఉన్న షేర్లు కూడా పెరుగుతాయి. కాబట్టి అప్పటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుండే కొంత ఈ గోల్డ్ ETF లలో పెట్టుకుంటూ పోతే లాభాలను ఒడిసి పట్ట్టుకోవచ్చు.
ఇన్ఫ్లిలేషన్: ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేస్తూ లాభాలను గడించవచ్చు. పైగా ఈ ఫండ్ లో అధిక లిక్విడిటీ కారణంగా ఎప్పుడైనా కొనుగోలు అమ్మకాలు ఈజీగా చెయ్యొచ్చు.
Top 10 ETF funds in india
5. యుటీఐ సెన్సెక్స్ ETF
ఈ ఫండ్ BSE సెన్సెక్స్ ఇండెక్స్ ఆధారంగా పని చేస్తుంది . నిఫ్టీ 50 లోని దాదాపు 30 బ్లూ-చిప్ కంపెనీలలో పెట్టుబడులను పెడుతుంది. ఇది సెన్సెక్స్ index ను సూచిస్తుంది.
లార్జ్ క్యాప్ అసెట్స్ : పెద్ద కంపెనీలలో పెట్టుబడుల కారణంగా మంచి రాబడులు అందిస్తుంది. ఇది కూడా రిస్క్ తక్కువ కోరుకునే వారికి మంచి ఎంపికని చెప్పొచ్చు.
6. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ETF
మరొక గోల్డ్ ETF ఇది . పెట్టుబడులకు సురక్షితమైన మార్గం. పైన చెప్పుకున్నట్లు ఎదైనా ఒకే సెక్టార్ లో పెట్టుబడులు పెడుతుంది కాబట్టి రిటర్న్స్ లో తేడా ఏమీ ఉండదు. ఎవరికి నచ్చిన దాంట్లో వారు చూజ్ చేసుకోవచ్చు .. కాకపోతే ఒక విషయం గుర్తు పెట్టుకోండి. ఏ ETF ఫండ్ తీసుకున్నప్పటికీ ట్రేడ్ వాల్యూం ఎంతుంది అనేది ఖచ్చితంగా చూడాలి రోజూ ఎక్కువ ట్రీడ్స్ జరుగుతున్న కౌంటర్ లను ఎంచుకోవాలి. లేదంటే మనం అమ్ముకోవాల్సి వచ్చినపుడు ఇబ్బంది పడతాం.
లిక్విడిటీ: ప్రతి రోజూ ఈ షేర్లు కూడా హై వాల్యూం తో ట్రేడ్ అవుతుంటాయి. మంచి పనితీరు వల్ల ఈజీగా ట్రేడ్ చేయవచ్చు.
7. కోటక్ బ్యాంకింగ్ ETF
బ్యాంకింగ్ సెక్టార్ అనేది దేశ ఆర్థిక వృద్ధికి మూల స్థంభం అని చెప్పొచ్చు. ప్రభుత్వ , ప్రైవేట్ బ్యాంకులు మన దేశ ఆర్థిక వ్యవస్థ లో భాగమై ఉన్నాయి. అలాంటి బ్యాంకింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ ETF లు అనుకూలంగా ఉంటాయి. ఒక బ్యాంక్ షేర్ లో మదుపు చెయ్యటం వలన రిస్క్ ఎక్కువ. కాబట్టి కొన్ని బ్యాంక్ లను కలిపి ఒక ETF ఫండ్ గా ఏర్పడిన దీనిలో పెట్టడం అనేది రిస్క్ తగ్గించుకోవడమే అవుతుంది.
వృద్ధి: బ్యాంకింగ్ సెక్టార్ మంచి వృద్ధిలో కొనసాగుతున్నందున ఈ ETF ఫండ్స్ కి మంచి ఆదరణ కొనసాగుతూ ఉంది.
8. యాక్సిస్ నిఫ్టీ 100 ETF
ఈ ETF నిఫ్టీ 100 ఇండెక్స్ లో పెట్టుబడులు పెడుతుంది. భారతదేశంలోని టాప్ 100 కంపెనీల్లో పెట్టుబడికి మదుపరులకు అవకాశం కల్పిస్తుంది.
మనం పైన చెప్పుకున్న నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 రెండూ కలిపితే 100 కంపెనీలు ఉంటాయి. ఈ ETF ప్రధానంగా టాప్ 100 కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది.
ఈ ఫండ్ లో ప్రధాన ఆకర్షణ ఏంటంటే .. రిస్క్ బాగా తక్కువ అలాగే రిటర్న్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మనం తక్కువ డబ్బుతో ఎక్కువ కంపెనీలలో భాగస్వామ్యం పొందే అవకాశాన్ని ఈ ఫండ్ అందిస్తుంది.
100 అసెట్స్: హ్యూజ్ డైవర్సిఫికేషన్, స్టేబుల్ ఇన్కమ్ వచ్చేలా ఈ ETF ఫండ్ ను రూపొందించారు.
9. ఎడెల్వైజ్ భారత్ బాండ్ ETF
భారతదేశంలోని మొదటి కార్పొరేట్ బాండ్ ETF ఇది, తక్కువ రిస్క్‌తో పెట్టుబడిపై ఆదాయాన్ని అందిస్తుంది. మిగతా ETF లతో పోల్చుకుంటే రిటర్న్స్ తక్కువనే చెప్పాలి కాకపోతే బ్యాంక్ డిపాజిట్ల కంటే కొంచెం మెరుగైన రాబడిని అందిస్తుంది. ముఖ్యంగా వడ్డీ రేట్లు పెరిగితే ఆ ప్రభావం దీనిపై ఎక్కువ పడుతుంది.
Details: స్థిరమైన రాబడులు, పన్నుల సౌలభ్యం.
10. మిరాయ్ అసెట్ NYSE FANG+ ETF
అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు Facebook, Amazon, Netflix, Google వంటి కంపెనీలలో పెట్టుబడికి భారతీయులకు అవకాశం కల్పిస్తుంది. కాకపోతే దీని NAV చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత ధరతో పోలిస్తే 20 – 30 శాతం ఎక్కువకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే రాబడి కూడా ఎక్కువే . ప్రపంచ దిగ్గజ కంపెనీలలో పెట్టుబడికి ఈ ఫండ్ అవకాశం కల్పిస్తుంది.
డిటైల్స్: అధిక వృద్ధి అవకాశాలు, గ్లోబల్ డైవర్సిఫికేషన్.
Top 10 ETF funds in india
ETFs పెట్టుబడి వలన ఉపయోగాలు
తక్కువ ఖర్చు: మ్యూచువల్ ఫండ్లతో పోల్చితే తక్కువ ఖర్చుతో ఉంటాయి.
డైవర్సిఫికేషన్: ఒకే సమయంలో పలు సూచీలలో పెట్టుబడికి వీలుంటుంది.
లిక్విడిటీ: స్టాక్స్ మాదిరిగానే ట్రేడింగ్ సాధ్యం.
పన్నుల సౌలభ్యం: తక్కువ క్యాపిటల్ గెయిన్స్ పన్ను.
ETFs పెట్టుబడులు సులభంగా సంపదను పెంచటానికి మరియు రిస్క్ తగ్గించకోడానికి ఉత్తమ మార్గం. భారతదేశంలోని టాప్ 10 ETF ఫండ్లు మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోతాయి. డైవర్సిఫికేషన్ మరియు తక్కువ ఖర్చుతో పెట్టుబడిని ప్రారంభించండి.
Desclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే .. పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ రిస్క్ ఆధారంగా ఆదాయం ఉంటుందని గమనించండి.. మార్కెట్ నిపుణులు సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళండి.