7. Nifty Alpha ETFలు (Exchange Traded Funds):
స్టాక్ మార్కెట్‌లో అత్యుత్తమ పనితీరు కనబరచే స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు రూపొందించబడిన ఫండ్స్ ఇవి. ఈ ETFలు నిఫ్టీ ఆల్ఫా సూచీని అనుసరిస్తాయి, ఇది మార్కెట్‌కు మించి రాబడి ఇవ్వగలిగిన స్టాక్స్‌ను గుర్తించేలా రూపొందించబడింది. నిఫ్టీ ఆల్ఫా ETFలు పెట్టుబడిదారుల కోసం తక్కువ రిస్క్‌తో మెరుగైన లాభాలను అందించే అద్భుతమైన సాధనంగా మారాయి.
నిఫ్టీ ఆల్ఫా ETF అంటే ఏమిటి?
నిఫ్టీ ఆల్ఫా ETFలు మార్కెట్‌లో ఆల్ఫా జనరేషన్ అనే విధానంపై ఆధారపడతాయి. “ఆల్ఫా” అంటే మార్కెట్ సగటు పనితీరు కంటే అధికమైన రాబడిని అందిస్తుంది. నిఫ్టీ ఆల్ఫా 50 సూచీ, గత మార్కెట్ డేటా ఆధారంగా, మంచి పనితీరు చూపిన 50 స్టాక్స్‌ను ఎంపిక చేస్తుంది. ఈ ETFలు వాటికనుగుణంగా పెట్టుబడిదారులకు దీర్ఘకాలంలో అధిక లాభాలను అందించగల సామర్థ్యాన్ని ఇస్తాయి.
Top 10 ETF funds 2024

Nifty alpha etf funds
నిఫ్టీ ఆల్ఫా ETF ల పనితీరును చూద్దాం
ఆల్ఫా జనరేషన్: ఈ ఫండ్స్ మార్కెట్ సగటు పనితీరు కంటే మెరుగైన రాబడిని అందించే స్టాక్స్‌కు ప్రాముఖ్యతనిస్తాయి.
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్: ఈ ETFలు స్టాక్ మార్కెట్లో కొనుగోలు, అమ్మకాలకు అనుకూలంగా ట్రేడ్ చేసుకునే వెసులుబాటు ఉంది.
మల్టిపుల్ సెక్టార్స్: నిఫ్టీ ఆల్ఫా 50 సూచీలో ఉండే వివిధ రంగాల స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా డైవర్సిఫికేషన్ ను అంధిస్తుంది.
యక్స్ పెన్స్ రేషియో: ఇతర మ్యూచువల్ ఫండ్లతో పోలిస్తే నిఫ్టీ ఆల్ఫా ETFలు తక్కువ నిర్వహణ వ్యయాన్ని కలిగి ఉంటాయి.
నిఫ్టీ ఆల్ఫా ETF లకు పెరుగుతున్న క్రేజీ
భారత స్టాక్ మార్కెట్‌లో ETF funds ఎర్లీ స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్ల చూపు వీటిపైకి మళ్ళింది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. నిఫ్టీ ఆల్ఫా ETF లు ముఖ్యంగా index లను మించి రాబడులు అందిస్తున్నాయి. వీటికి ప్రధాన కారణాలు..
1. స్టాక్ మార్కెట్ ప్రగతికి అనుగుణంగా ఎక్కువ లాభాలు ఇవ్వడం
2. పెట్టుబడుల రిస్క్‌ను తగ్గించే మెకానిజం వీటి సొంతం
3. మార్కెట్‌లోని అత్యుత్తమ స్టాక్స్‌లో పెట్టుబడికి అవకాశం కల్పిస్తుండడం
ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్లో కొన్ని ప్రముఖ నిఫ్టీ ఆల్ఫా ETF లు ఏంటో .. చూద్దాం
1. ICICI Prudential Alpha ETF
2. Aditya Birla Sun Life Nifty Alpha 50 ETF
3. కోటక్ నిఫ్టీ ఆల్ఫా 50 ETF
నిఫ్టీ ఆల్ఫా 50 సూచీ ఆధారంగా పనిచేస్తుంది.అధిక ఆల్ఫా కలిగిన స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతుంది
ప్రస్తుత లాభాలు: ఒక సంవత్సరానికి సగటు రాబడి 58.9%.
4.నిప్పాన్ ఇండియా ETF:
నిఫ్టీ ఆల్ఫా లో వోలాటిలిటీ 30హై ఆల్ఫా మరియు లో వోలాటిలిటీ కలిగిన స్టాక్స్.
స్థిరమైన లాభాలను కోరుకునే వారికి అనుకూలమైన ఫండ్. ఒక సంవత్సరానికి సగటు రాబడి 22.00%
5.మోతిలాల్ ఓస్వాల్ NASDAQ 100 ETF
ఇది నిఫ్టీ ఆధారితం కాకపోయినా, గ్లోబల్ హై గ్రోత్ టెక్ కంపెనీల్లో పెట్టుబడి చేస్తుంది. ఒక సంవత్సరానికి 31.26%, మూడు సంవత్సరాలకు 15.59%.
6. LIC MF ETF – నిఫ్టీ 100
నిఫ్టీ 100 సూచీ ఆధారంగా పనిచేస్తుంది.వివిధ రంగాలలోని టాప్ కంపెనీల్లో పెట్టుబడి.గత ఏడాదికి సగటు రాబడి 32.28%.
నిఫ్టీ ఆల్ఫా ETFల లాభాలు
ఆధిక రాబడులు: మార్కెట్ సగటు రాబడి కంటే ఎక్కువ లాభాలను అందించగలదు.
లిక్విడిటీ: స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం ద్వారా పెట్టుబడిదారులకు సులభంగా లిక్విడిటీ కల్పిస్తుంది.
ఆపర్చ్యునిటి: ఈ ETFలు వివిధ రంగాల్లోని టాప్ స్టాక్స్‌లో పెట్టుబడి చేసే అవకాశాన్ని కల్పిస్తాయి.
తక్కువ ఖర్చు: పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం లేకుండా చిన్న మొత్తలతో అధిక లాభాలను పొందవచ్చు.
Top 10 ETF funds 2024
పెట్టుబడికి ముందు తెలుసుకోవలసినవి
1. మార్కెట్ ఫ్లెక్చువేషన్స్: స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి ఈ ETFల పనితీరును ప్రభావితం చేయవచ్చు.
2. వోలటాలిటీ: ఆల్ఫా అధికంగా ఉన్న స్టాక్స్ ఎక్కువ వోలాటిలిటీ కలిగి ఉండవచ్చు.
3. డైవర్సిఫికేషన్: నిఫ్టీ ఆల్ఫా 30, 50, 100, 250, 500. సూచీలో ఉన్న కంపెనీలలో ఈ ETF ఫండ్ లు అలకేట్ చేస్తారు
4. పరిశీలన: ETFల గత రాబడులను విశ్లేషించి మీ పెట్టుబడులకు ప్రణాళిక వేసుకోండి.
5. లాంగ్ టర్మ్ : దీర్ఘకాల పెట్టుబడులకు ఈ ETFలు అత్యుత్తమంగా ఉంటాయి.
6. నిపుణుల సలహా తీసుకోండి: పెట్టుబడులు చేసే ముందు ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌ను సంప్రదించడం ఉత్తమం.
7. పూర్తి అవగాహన పెంపొందించుకోండి: మార్కెట్ ట్రెండ్‌లను పరిశీలించి సరైన సమయాన్ని ఎంచుకొని కొనుగోలు చేసినట్లయితే మంచి లాభాలను కళ్ల చూడొచ్చు
భారత స్టాక్ మార్కెట్ 2025లో వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. టాప్ స్టాక్స్ లో పెట్టుబడి చేయడానికి ఆసక్తి ఉన్న వారికి, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టేవారికి నిఫ్టీ ఆల్ఫా ETFలు ప్రముఖంగా పెట్టుబడి పెట్టడానికి అనుకూలం
నిఫ్టీ ఆల్ఫా ETFలు మార్కెట్ సగటు రాబడికి మించి లాభాలను అందించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ ఫండ్లు పెట్టుబడిదారులకు తక్కువ రిస్క్‌తో అధిక లాభాలను అందించేలా రూపొందించబడ్డాయి. మార్కెట్ అభివృద్ధిని నమ్మిన ప్రతి పెట్టుబడిదారుడికి నిఫ్టీ ఆల్ఫా ETFలు ఉత్తమమైన ఇన్వెస్ట్మెంట్లకి మార్గం గా చెప్పవచ్చు.. మీ పెట్టుబడులను మంచి వృద్ధికి అవకాశం ఉన్న ETF ప్లాట్‌ఫారమ్ లలో ఇన్వెస్ట్ చేసి, భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలను చేరుకోడానికి మార్గం సుగమం అవుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ నిపుణుల అభిప్రాయం తీసుకోండి