7. మిరే అస్సెట్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ETF గురించి వివరాలు
నేటి ఆర్థిక ప్రపంచంలో ఇన్వెస్ట్‌మెంట్ అనేది ప్రతి ఒక్కరికీ ముఖ్యం. అందులోనూ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) ఈ మధ్య కాలంలో మరింత ప్రాచుర్యం పొందాయి. ఇలాంటి ETFsలో ఒకటి మిరే అస్సెట్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ETF. ఇప్పుడు మనం దీని ప్రత్యేకతలు, ప్రయోజనాలు, మరియు ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం.
మిరే అస్సెట్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ETF అంటే ఏమిటి?
ETFs అనేది స్టాక్ మార్కెట్‌లో ట్రేడయ్యే స్టాక్స్ లాంటివి ఒక కంపెనీ స్టాక్ ను ఎలాగైతే స్టాక్ మార్కెట్లో Buy / Sell చేస్తామో.. అలాగే ETF funds ను కూడా ట్రేడ్ చెయ్యొచ్చు.. దీని వల్ల ఏరోజు కారోజు ETF stock ప్రైస్ ను డైలీ చార్ట్స్ లో చూసుకునే వెసులు బాటు ఉంది.
మిరే అస్సెట్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ETF అనేది.. నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ను ట్రాక్ చేస్తుంది. ఈ ఇండెక్స్‌లో మధ్య స్థాయి కంపెనీలు (mid-cap companies) ఉంటాయి. వీటి మార్కెట్ క్యాపిటలైజేషన్ మధ్యస్థంగా ఉంటుందని భావించవచ్చు.
నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ETF ప్రత్యేకతలు
డైవర్సిఫికేషన్:
ఈ ETF 150 మధ్యస్థ కంపెనీలను కలిగి ఉంటుంది, అంటే విభిన్న రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు ఉంటాయి.
కమిషన్ తక్కువ:
మిగతా మ్యూచువల్ ఫండ్‌లతో పోల్చితే, ETFsలో నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి.
సులభమైన ట్రేడింగ్:
స్టాక్ మార్కెట్‌లో మీరు ఈ ETFని షేర్‌లా కొనుగోలు చేయవచ్చు.
Regular update:
నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ ETF అప్డేట్ అవుతుంది.
ఎక్కువ వ్యాపార అవకాశాలు:
మధ్యస్థ కంపెనీలు పెద్దవిగా ఎదగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే, అలాంటి ఎదుగుదలలో మీరు భాగస్వామ్యం పొందగలుగుతారు.
ట్రాన్స్పరెంట్:
ETFs పూర్తి ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి కాబట్టి రోజువారీ NAV (Net Asset Value) ఆధారంగా మీరు ట్రేడింగ్ చేయవచ్చు.
బెనిఫిట్స్:
డివిడెండ్ల రూపంలో పాసివ్ ఇన్కమ్ పొందవచ్చు. అలాగే, మార్కెట్ ధర పెరగడం ద్వారా మెరుగైన రాబడులు పొందవచ్చు.
ఎవరికి ఈ ఈటిఎఫ్ సరిపోతుంది..?
మధ్యస్థ కంపెనీల వృద్ధిని నమ్మేవారు.
డైవర్సిఫై చేయాలనుకునే ఇన్వెస్టర్లు.
తక్కువ ఖర్చుతో లాంగ్‌టర్మ్ రాబడులు పొందాలనుకునే వారు.

మిరే అస్సెట్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ETFలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?
1. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి:
ఈ ETFని కొనుగోలు చేయాలంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కోసం డీమాట్ అకౌంట్ అవసరం.
2. స్టాక్ బ్రోకర్ ను ఎలా ఎంచుకోవాలి:
మీరు అప్‌స్టాక్, జీరోధా వంటి ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ లను ఉపయోగించి కొనుగోలు చేయవచ్చు.
3. ETF ఎంచుకోవడం:
మీ డీమ్యాట్ అకౌంట్ ద్వారా మిరే అస్సెట్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ETF లో ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేయండి.
4. లాంగ్‌టర్మ్ కోసం ఫోకస్:
మధ్యస్థ కంపెనీలు ఎదగడానికి సమయం పడుతుంది. అందువల్ల దీర్ఘకాలం పెట్టుబడి ఉంచడం మేలని చెప్పొచ్చు.
మార్కెట్ రిస్క్
స్టాక్ మార్కెట్ లో జాతీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి మార్పులు జరిగినా ఈ ETF హెచ్చు తగ్గులకి ప్రభావితం అవుతుంది అని గుర్తుంచుకోండి.
పనితీరును గమనించాలి
మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా మిడ్ క్యాప్ కంపెనీల పనితీరు బలహీనంగా ఉంటే ఫండ్స్ రాబడి తగ్గవచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు గమనిస్తూ మీ ETF లను మార్పులు చేసుకుంటే లాభాలను కాపాడుకోవచ్చు.

Mirae Asset Nifty Midcap 150 ETF (INF769K01IC9)
ప్రస్తుత ధర: ETF ధర ₹21.35
52-వారాల
గరిష్టం: ₹23.20
కనిష్టం: ₹16.84
మార్కెట్ క్యాప్: 959.29 కోట్లు
ఫండ్ ప్రారంభం నుండి రాబడులు:
ఈ ETF ప్రారంభమైన ఈ ఫండ్ ఇప్పటివరకు దాదాపు 29% సగటు వార్షిక రాబడులు అందించింది.
ఫీచర్లు
1. NSE Mid Cap: ఇది Nifty Midcap 150 Indexను అనుసరిస్తుంది కాబట్టి.. భారతదేశంలోని 150 మిడ్‌క్యాప్ స్టాక్స్ పనితీరు ఆధారంగా పని చేస్తుంది.
2. బ్యాలెన్స్డ్ డైవర్సిఫికేషన్: మిడ్‌క్యాప్ కంపెనీల స్టాక్స్ విభిన్న రంగాల్లో ఆర్ధిక వృద్ధికి అవకాశాలను అందిస్తుంది.
3. ఎక్స్ పెన్స్ రేషియో: ఇది ఇతర మ్యూచువల్ ఫండ్ల కంటే కూడా తక్కువ రేషియో ఉంటుంది.
ఎవరికి ఈ ETF ఫండ్ లు ఉపయోగం..?
మధ్యకాలం & దీర్ఘకాలం కోసం మంచి రాబడులు కోరుకునేవారు.
రిస్క్ తీసుకోవడానికి సిద్ధమైనవారు, ఎందుకంటే మిడ్‌క్యాప్ స్టాక్స్ ఎక్కువగా మార్పులకు లోనవుతుంటాయి.
డైవర్సిఫికేషన్ కోసం కొత్త మార్గాలను అన్వేషించేవారు.
మిరే అసెట్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ETF ఒక ఉత్తమమైన ఇన్వెస్ట్‌మెంట్ కి వేదిక అనుకోవచ్చు, ముఖ్యంగా లాంగ్‌టర్మ్ పెట్టుబడిదారులకు ఈ ETF ద్వారా మంచి డైవర్సిఫికేషన్ పొందడం, మధ్యస్థ కంపెనీల వృద్ధిలో భాగస్వామ్యం కావడం మీ పెట్టుబడికి కొత్త దిశగా మార్పు తీసుకురావచ్చు. అయితే, మార్కెట్‌ను జాగ్రత్తగా విశ్లేషించి, రిస్క్‌ను గుర్తించి పెట్టుబడులు పెట్టడం చాలా ముఖ్యం.
Disclaimer: ఈటిఎఫ్ లలో పెట్టుబడికి ముందు మార్కెట్ నిపుణుల అభిప్రాయం తీసుకోండి.. ఇది కేవలం ఇన్వెస్టర్ల అవగాహన కోసం మాత్రమే