Top 10 Etf funds 2024
2024 లో అత్యధిక రిటర్న్స్ అందించిన ఫండ్స్ ఏంటి..?
ETF ఫండ్స్ నేరుగా కంపెనీల షేర్స్ కు పోటీపడి మరీ ఎక్కువ రిటర్న్స్ ను అందిస్తున్నాయి. భారత్ లో వీటి మీద రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తున్నారు. ETF లకు ఉన్న అడ్వాంటేజ్ లను పరిశీలించినట్లయితే.. ETF లను సాధారణ ఇన్వెస్టర్ అధిక సమయం కేటాయించి రీసెర్చ్ చేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తాయి.
ఫండ్ మేనేజర్లు కొన్ని మంచి కంపెనీలను ఎంచుకొని రీసెర్చ్ చేసి తీసుకోవడం జరుగుతుంది. అంతే కాక వాటి క్వార్టర్లీ, రిజల్ట్స్ ను ఎప్పటికప్పుడు సమీక్షించి బాగా పెర్ఫార్మ్ చేస్తున్న వాటిని మాత్రమే ఉంచి మిగతా వాటిని తీసివేసి వాటి స్థానంలో వేరే కంపెనీలను యాడ్ చేస్తారు.
అంతే కాక ఫండ్ నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. 0.05 నుండి మొదలవుతాయి. అందు వల్ల ఇన్వెస్టర్ కు వచ్చే లాభంలో ఈ ఖర్చు తక్కువే.
ఈ బిజీ లైఫ్ లో ఎప్పటికప్పుడు షేర్ మార్కెట్ హెచ్చు తగ్గుల గురుంచి తెలుసుకోవడం కష్టమే. సమయం పరంగా చూసినా లేదా రిస్క్ పరంగా చూసినా కూడా ETF funds లో పెట్టుబడి లాభమనే చెప్పాలి.
అవగాహన కోసం ETF funds గురుంచి వివరంగా తెలుసుకుందాం.
Top 10 Etf funds 2024
ఇన్వెస్టర్ ప్లానింగ్ :
ETF ఫండ్స్ లో పెట్టుబడికి ముందు ఇన్వెస్టర్ చూడాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే..
- ఎంత కాలానికి ఇన్వెస్ట్మెంట్స్ చేద్దామని అనుకుంటున్నారు.
- రిస్కు మేనేజ్మెంట్ ను బట్టి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ ను ఎంచుకోవాలి.
- సెక్టోరల్ ఫండ్స్ ను కూడా పరిగణ లోకి తీసుకొని ఏది మీకు సరిపోతుందో నిర్ణయించుకోవాలి.
- అన్నిటికంటే కూడా ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే “ వాల్యూం “ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. వాల్యూం తక్కువున్న ETF funds లో ఇన్వెస్టు చేస్తే అమ్ముకునే సమయంలో కొనేవారు లేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
- ETF funds ను నిర్వహిస్తున్న హౌస్ ల గత చరిత్ర తెలుసుకోవాలి. ఫండ్ మేనేజర్ గురుంచి కూడా తెలుసుకోవాలి.
- కొన్ని ETF లను పెద్ద ఫండ్ హౌస్ లు మేనేజ్ చేస్తున్నప్పటికీ కూడా ఆ కౌంటర్స్ లో వాల్యూం చాలా తక్కువ ఉంటుంది. అలాంటి వాటికి దూరంగా ఉండండి.
- మీరు ఎంచుకునే ETF funds లో గత 5 సం” లు, 10 సం” ల యావరేజ్ రిటర్న్స్ ఎంత అనేది చూడండి.
- అవి మేనేజ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్న కంపెనీలను వాళ్ళ వెబ్సైట్ లేదా NSE/ BSE వెబ్ సైట్ లో డిటైల్స్ ను పరిశీలించండి
- ETF funds లో రాబడి సరాసరి 20% – 25 % ఉండేలా చూసుకుంటే మీ పెట్టుబడి కి మంచి రాబడి వస్తుంది.
- ఫండ్ హౌస్ లు ఏయే అసెట్స్ లో మన డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలి
Top 10 Etf funds 2024
సంవత్సర కాలానికి అధిక లాభాలు పంచిన ఫండ్స్:
గత సంవత్సరం కాలంలో అత్యధిక రిటర్న్స్ అందించిన ETF funds ను పరిశీలిద్దాం
1. Tata Nifty India Digital ETF ( TNIDETF)
టాటా ఫండ్ హౌస్ డిజిటల్ కంపెనీలను ఎంచుకొని సంవత్సర కాలంలో 45% రిటర్న్స్ అందించిన ఫండ్ ఇది . మంచి కంపెనీలలో పెట్టుబడి పెడుతున్న ఈ ఫండ్ గురుంచి తెలుసుకుందాం.
టాటా నిఫ్టీ డిజిటల్ ఈటిఎఫ్ ఫండ్ 2022 నుండి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అవ్వడం మొదలయ్యింది. ఈ ఫండ్ ఇప్పటి వరకూ చూస్తే గనుక మంచి రిటర్న్స్ ఇచ్చింది..
ఇప్పటివరకూ సుమారుగా 18.3% శాతం లాభాలను అందించింది. అదే ఒక సంవత్సర కాలానికి చూసుకుంటే సుమారు 45% లాభాలను అందించింది. ఈ ఫండ్ అసెట్స్ అలకేషన్ చూస్తే 30 డిజిటల్ కంపెనీలకు వాటి వెయిట్ ఆధారంగా అలకేట్ చెయ్యడం జరిగింది.
Top 10 Etf funds 2024
FUND AUM – 139 కోట్లు, P/E రేషియో – 51.52% , P/B రేషియో – 7.36% , ఫండ్ మేనేజర్ : Meeta Shetty.
Assets Companies
- HCL Technologies – 7.91%
- Policy Bazaar – 7.87%
- Info Edge (india) – 7.47%
- TCS – 7.41%
- Infosys – 7.40%
- Bharati Airtel – 7.30%
- Zomato – 6.75%
- Tech Mahindra – 5.49%
- Wipro – 4.19%
- Paytm – 4.02%
- IRCTC – 3.88%
- NYKAA- 3.87%
- TATA Communications – 3.26%
- Persistent System – 3.05%
- Vodafone idea – 3.00%
- LTI Mind tree – 2.86%
- Coforge – 2.72%
- Mphasis- 1.75%
- Oracle – financial software – 1.34%
- Tata Elxsi – 1.30%
- KPIT Technologies – 1.22%
- India Mart – 1.19%
- Cyient – 0.83%
- L&T technology services – 0.74%
- TATA technologies – 0.66%
- Sonata software – 0.64%
- Affle (india)- 0.52%
- Birla soft- 0.48%
- Intellect Design Arena- 0.35%
- Tanla- 0.29%
ఈ వివరాలు కేవలం ఇన్వెస్టర్స్ అవగాహన కోసమే. పెట్టుబడి పెట్టే ముందు తెలిసిన వారి లేదా మార్కెట్ పండితుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి.