ETF News Telugu

Infra Etf funds in india భారత్ గ్రోత్ లో ముఖ్య పాత్ర అయిన ఇన్ప్రా ఈటిఎఫ్ ల గురుంచి తెలుసుకుందాం

Infra ETF ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే మంచి రిటర్న్స్ ను అందిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు పరంగా చూసినట్లయితే infra ETF లను మీ పోర్ట్ఫోలియో చేర్చవచ్చు.

Infra ETF (Exchange Traded Funds) ఫండ్స్ అంటే ప్రధానంగా నేషనల్ హైవే రోడ్లు, పైపు లైన్లు , ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తదితర మౌలిక వసతుల రంగానికి సంబంధించిన సంస్థలలో పెట్టుబడులను అందించే ETF ఫండ్స్. వీటిని స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయవచ్చు. రోడ్లు, విద్యుత్, రైల్వేలు, గ్యాస్ పంపిణీ, కమ్యూనికేషన్ వంటి రంగాల్లో కంపెనీలు ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు చేపడతాయి అలాంటి కంపెనీలలో ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఒకే రకమైన గ్రూప్ ఆఫ్ కంపెనీలలో ETF funds ఇన్వెస్ట్ చేసి పెట్టుబడిదారులకి మంచి లాభాలను అందిస్తాయి.

Infra ETF funds

భిన్నమైన పెట్టుబడులు: ఇన్‌ఫ్రా ETFలు మౌలిక వసతుల రంగంలో వివిధ కంపెనీలలో పెట్టుబడి చేసే అవకాశాలను అందిస్తాయి.


స్టాక్ మార్కెట్: ఈ ETFలు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయబడతాయి, దీని వల్ల పెట్టుబడిదారులు వాటిని తక్షణమే కొనుగోలు లేదా అమ్మకం చేయవచ్చు.

యక్స్ పెన్స్ రిషియో: సాంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే ఇన్‌ఫ్రా ETFలు తక్కువ నిర్వహణ ఛార్జీలు కలిగి ఉంటాయి.


లాంగ్-టర్మ్: మౌలిక వసతుల రంగం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూ ఉండే రంగం కనుక దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Infra Etf funds



Infra ETF పెర్ఫార్మెన్స్

ప్రస్తుతం ఇండియా మౌలిక వసతుల రంగంలో దూసుకుపోతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్  లైన్ (NIP), గతిశక్తి ప్లాన్ వంటి నిర్ణయాలు ఈ రంగానికి ఎంతో ఊతమిస్తున్నాయి. దీనితో పాటు ప్రైవేట్ రంగం కూడా భారీగా పెట్టుబడులు పెడుతోంది.

అందువల్ల ఇన్‌ఫ్రా ETFలు పెట్టుబడిదారులకి మంచి లాభాలను అందిస్తున్నాయి. కొన్ని ముఖ్యమైన ఇన్‌ఫ్రా ETF లు ఏంటో చూద్దాం..

1. ICICI Prudential Nifty Infrastructure ETF


2. SBI Infrastructure Fund


3. Kotak Infrastructure and Economic Reform Fund


4. UTI Infrastructure Fund


ఈ ఈటిఎఫ్ లు గత సంవత్సరం నుంచి సగటున 10% నుండి 20% శాతం రాబడులను  అందించాయి. కొన్ని సందర్భాలలో ఈ ఈటిఎఫ్ లు ఎక్కువ లాభాలను కూడా ఇచ్చాయి.


Infra ETF Funds ప్రాఫిట్స్

డైవర్సిఫికేషన్: ఇన్‌ఫ్రా ETFలు వివిధ మౌలిక రంగ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా పెట్టుబడిదారులకు డైవర్సిఫికేషన్ అవకాశాలను అందిస్తాయి.


Low రిస్క్: దీర్ఘకాల పెట్టుబడిదారులకు తక్కువ రిస్క్ తో స్థిరమైన రాబడులు పొందే అవకాశం ఉంటుంది.


ట్రేడింగ్: స్టాక్ మార్కెట్‌లో లభ్యం కావడం వల్ల కొనుగోలు, అమ్మకం సులువుగా చేయవచ్చు.


ఇన్వెస్టర్లు గుర్తుంచు కోవలసినవి

పరిశీలన: ఈ ఈటిఎఫ్ ల గత లాభాలను గమనించండి భవిష్యత్తులో ఇన్ఫ్రా రంగం ఎలా ఉండబోతుందో ఒక అంచనాకు వచ్చాక మాత్రమే.. ఇన్వెస్ట్మెంట్స్ నిర్ణయాన్ని తీసుకోండి.


ప్రాజెక్టులు : కొత్త మౌలిక వసతుల ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టడం లాభదాయకం.


లాంగ్ టర్మ్: మౌలిక రంగం అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది కనుక దీర్ఘకాల పెట్టుబడులపై దృష్టి పెట్టడం మంచిది.


ఇన్వెస్ట్‌మెంట్‌కు సరైన సమయాన్ని చూడండి

ప్రస్తుతం భారత ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో, ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2024-25లో భారత్ మౌలిక రంగంలో ప్రపంచంలో ఒక ముందువరుస దేశంగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యం కావాలనుకునే పెట్టుబడిదారులకు ఇన్‌ఫ్రా ETFలు సరైన ఎంపికగా ఉంటాయి.


ఇన్‌ఫ్రా ETFలు తక్కువ రిస్క్‌తో మంచి రాబడులు అందించే పెట్టుబడిగా పేరొందాయి. ప్రస్తుతం ఈ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, ప్రైవేట్ పెట్టుబడుల వృద్ధి ఈ ETF లకు మరింత విలువను అందిస్తున్నాయి. మీ పెట్టుబడులు సురక్షితంగా ఉండి, అధిక రాబడులను ఇవ్వాలంటే ఇన్‌ఫ్రా ETFలను పరిశీలించండి.

Disclaimer: ఫైనాన్షియల్ కన్సల్టెంట్ నుండి నిపుణుల సలహాలు తీసుకుని మీ పెట్టుబడుల ప్రణాళికను రూపొందించుకోండి.

ఇన్ఫ్రా ఈటీఎఫ్ ఫండ్స్ లాభాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ETF News Telugu