ETF News Telugu

FMCG ETF FUNDS: ఈ సెక్టార్ లాభాలు ఎలా ఉంటాయి..?

ఇండియాలోని FMCG ETF funds గురించి తెలుసుకుందాం..

గత ఐదు సంవత్సరాలలో FMCG (ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్) ETF ఫండ్స్ మంచి రిటర్న్‌లు అందించాయి. ప్రధానంగా, Nifty FMCG ETF వంటి ఫండ్స్, ఈ సెక్టార్‌లోని ప్రముఖ కంపెనీలలో పెట్టుబడులు పెట్టి నిఖర  వృద్ధి ని అందించాయి. ఈ ETF ఫండ్స్ వరుసగా 5% నుంచి 12% వరకూ లభాలను ఇచ్చాయి.

మున్ముందు వృద్ధికి అవకాశాలు మెరుగ్గా ఉండబోతున్నాయి. కాబట్టి గతం లో వచ్చిన రిటర్న్స్ మాత్రమే పరగణించకుండా భవిష్యత్తు లాభాలను , వృద్ధి కి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం మంచిది.



ఇందులో ICICI Pru Nifty FMCG ETF లు గడిచిన 5 సంవత్సరాల కాలంలో సుమారు 10% సగటు వార్షిక రిటర్న్‌ను అందించింది. ఈ ETF FMCG కంపెనీల స్టాక్స్‌లో  ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ.. వృద్ధికి అవకాశం ఉన్న ముఖ్యంగా గోద్రేజ్ కన్స్యూమర్, యూనైటెడ్ స్పిరిట్స్ మరియు కొల్గేట్-పామ్‌లివ్ వంటి స్టాక్స్ ఆ రిటర్న్స్ లో భాగమయ్యాయి.



FMCG ETF ఫండ్స్ భవిష్యత్తు వృద్ధికి మంచి అవకాశాలు కనిస్తున్నాయి, స్థిరమైన డిమాండ్ మరియు కొనుగోలుదారుల అవసరాలు దేశ జనాభా పెరుగుదలకు తగ్గట్లు గ్రోత్ కనిపిస్తుంది. కాబట్టి ఈ సెక్టార్ వృద్ధి ఏటి కేడాది పెరుగుతూనే ఉంటుంది.



FMCG (Fast-Moving Consumer Goods) రంగం ప్రజల నిత్యావసరాలను తీర్చే ఉత్పత్తులతో ప్రజల అవసరాలకనుగుణంగా పెరుగుతూ ఉంటుంది. ఈ రంగానికి భారత్‌లో ఎప్పుడూ మంచి గిరాకీ ఉంటుంది, ఎందుకంటే ఇది ప్రాథమిక అవసరాల ఉత్పత్తులను అందిస్తుంది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరుకునే వారికి FMCG ETFs (Exchange Traded Funds) మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు.

ETFs అంటే ప్రత్యేకంగా కొన్ని కంపెనీల షేర్లను కలిపి రూపొందించిన ఫండ్ అని తెలిసిందే. ఈ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయబడతాయి. FMCG ETFs అంటే ప్రత్యేకంగా FMCG రంగంలోని కంపెనీలను ఫోకస్ చేసిన ఫండ్స్ అని అర్థం.



FMCG ETF ఫండ్స్ యొక్క ఉపయోగాలు

డైవర్సిఫికేషన్: ఒక్కో కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టడం కంటే, ఈ ETFs ద్వారా వివిధ FMCG కంపెనీలలో ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు.


స్టేబుల్ రిటర్న్స్: FMCG రంగం ఎల్లప్పుడూ సుస్థిరంగా ఉంటుంది కనుక దీర్ఘకాలిక రిటర్న్స్ ఆశించిన స్థాయిలో ఉంటాయి.


రిస్క్ తక్కువ: ఆర్థిక మాంద్యం వల్ల మార్కెట్ హెచ్చు తగ్గులకు గురైనప్పటికీ .. ఈ రంగం మీద  అంతగా ప్రభావం ఉండదనే చెప్పాలి.


ఇండియాలో అందుబాటులో ఉన్న ప్రముఖ FMCG ETF లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1. Nippon India ETF Nifty FMCG BEES

ఇది Nifty FMCG Index లోని స్టాక్స్ లో invest చేస్తుంది.

ఇందులో ITC, Hindustan Unilever, Dabur india, Britannia వంటి లార్జ్ క్యాప్ కంపెనీల షేర్లు ఉంటాయి.



2. ICICI Prudential FMCG ETF

ఇది కూడా Nifty FMCG Index ఆధారంగా పనిచేస్తుంది.

ఇందులోని కంపెనీలు మార్కెట్ లీడర్లుగా రాణిస్తున్నాయి



3. Aditya Birla Sun Life FMCG ETF

ఇది ప్రధానంగా HUL, Nestle, Godrej Consumer వంటి కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది.

పైన చెప్పుకున్న అన్ని ETF ఫండ్ లు కూడా ఈ సెక్టార్ లో ఉన్న ప్రముఖ కంపెనీల అసెట్స్ లోనే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి. కాబట్టి వీటిలో దేనిలో మీరు పెట్టుబడి పెట్టాలనుకున్నా… ఆ ఫండ్ లిక్విడిటీ, డైలీ కౌంటర్ వాల్యూమ్స్, ఎక్స్పెన్స్ రేషియో మరియు వాటి ప్రస్తుత ధరల ఆధారంగా నిర్ణయం తీసుకోండి.




ఈ ETF funds లో ఎలా పెట్టుబడి పెట్టాలి?

1. డీమ్యాట్ అకౌంట్: మొదట మీకు డీమ్యాట్ అకౌంట్ కావాలి కాబట్టి మీకు అనువైన అకౌంట్ ను ఓపెన్ చేసుకోండి ఉదాహరణకు కొన్ని ఇవ్వడమైనది అవేంటో చూద్దాం


2. బ్రోకర్ లేదా యాప్: Zerodha, Groww, 5 Paisa లాంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ ETF funds ను కొనుగోలు చేయవచ్చు.


3. మార్కెట్ ట్రెండ్: మార్కెట్ ట్రెండ్‌ను గమనిస్తూ.. తక్కువకు పడినప్పుడు తగిన ధర వద్ద కొనుగోలు చేయడం మంచిది.



పెట్టుబడికి ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి

ఎక్స్పెన్స్ రేషియో: ప్రతి ETFకు నిర్వహణ చార్జీలు ఉంటాయి. వాటిని అంచనా వేసి ఎంపిక చేయాలి.

మార్కెట్ రిస్క్: అయినా, ఇది స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ అయ్యే ఫండ్ కాబట్టి మార్కెట్ రిస్క్ ఉంటుంది.


ఈ ఈటీఎఫ్ లు ఎవరికీ తగినవి?

FMCG ETFs అనేవి ఎక్కువ రిస్క్ తీసుకోలేని వారికి సరైన ఎంపిక. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు, స్టేబుల్ రిటర్న్స్ కోరుకునేవారు ఈ ఫండ్స్‌ను ఎంపిక చేయవచ్చు.

FMCG రంగం మీద పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు నిత్యావసర ఉత్పత్తుల రంగం అభివృద్ధిలో భాగస్వామి అవ్వవచ్చు. దీని ద్వారా మీ పెట్టుబడి భద్రతతో పాటు మంచి రిటర్న్స్ పొందే అవకాశం ఉంది.

Disclaimer: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ నిపుణుల అభిప్రాయాలను తీసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ETF News Telugu