ఈ టి ఎఫ్ లో ఎవరు ఇన్వెస్ట్ చెయ్యొచ్చు .. ?
ETF investments : Who can invest in etf .. ? ఈ టి ఎఫ్ లలో ఎవరు ఇన్వెస్ట్ చెయ్యొచ్చు.. ? Who can invest in ETFs?
స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఉన్న వారికి ETF ల గురించి అవగాహన ఉంటుంది కానీ కొత్తగా పెట్టుబడుల మార్గాన్ని అన్వేషించే మదుపరులకు వీటి గురించి తెలిసే అవకాశం తక్కువ ఎప్పుడైతే మదుపు చేయాలని అనేక మార్గాల ద్వారా తెలుసుకోవాలని అనుకుంటారో అప్పుడు మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన మదుపు మార్గం ఈ ETF లని చెప్పుకోవచ్చు.
రిస్క్ తక్కువ గా ఉండి పెట్టుబడి సురక్షితంగా ఉండే ఫండ్ కోసం ఎదురుచూసే ఇన్వెస్టర్లకు ఇది మంచి మార్గం నిఫ్టీ , సెన్సెక్స్ లలో ట్రేడ్ అయ్యే కొన్ని కంపెనీలను ఒక ఫండ్ గా ఏర్పాటు చేసి లిస్టింగ్ చేస్తారు ETF లు కూడా షేర్ల లాగే ప్రతి రోజు స్టాక్ మార్కెట్ లో అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి కాకపోతే ఓకే రోజు ఎక్కువగా పెరగటం లేదా తగ్గటం అనే ప్రభావం తక్కువగా ఉంటుంది .. ఫండ్ మేనేజర్లు మంచి కంపెనీలను ఎంచుకొని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు కాబట్టి మార్కెట్లో వచ్చే హెచ్చు తగ్గులకనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు కాబట్టే రిస్క్ కొంచెం తక్కువగా ఉంటుంది
మన సుదీర్ఘ లక్ష్యాలకు అనుగుణంగా మార్కెట్లో రక రకాల etf లు అందుబాటులో ఉన్నాయి మనకు ఏది సరిపోతుందో చూసుకొని పెట్టుబడులను పెట్టడం మంచిది చాలా మాధ్యమాల్లో ఇన్ఫర్మేషన్ ఈజీగా దొరుకుతుంది కావలసిందల్లా కొంచెం ఓపిక మాత్రమే
ప్రతి రోజూ etf ల సమగ్ర సమాచారం మన వెబ్సైట్ న్యూస్ ద్వారా తెలుసుకోవచ్చు.
అసలు etf లో పెట్టుబడులకు చేయాల్సిన ప్రాథమిక అంశాలు మున్ముందు ఆర్టికల్స్ లో తెలుసుకుందాం