Debt ETFs (Exchange Traded Funds) అనేవి డెట్ మార్కెట్‌లో ఉన్న ప్రైవేటు మరియు గవర్నమెంట్ కంపెనీలపై ఆధారపడి పనిచేసే ఫండ్స్. ఇవి బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, మరియు కార్పొరేట్ డెట్ వంటి డెట్ ఇన్స్ట్రుమెంట్స్‌ను ట్రాక్ చేస్తుంది.
Debt ETFs అంటే ఏమిటి
గవర్నమెంట్ బాండ్స్ ETFs
కార్పొరేట్ బాండ్స్ ETFs
శ్రేణి పద్ధతిలో నిర్వహించబడిన బాండ్స్
ఇవి ఎక్కువగా తక్కువ నష్టాలకు మరియు స్థిరమైన రాబడికి ప్రసిద్ధి చెందాయి.
Debt ETFs ప్రాధాన్యత పరంగా చూస్తే..
1. తక్కువ ఖర్చుతో పెట్టుబడి
Debt ETFs కి నిర్వహణ వ్యయం చాలా తక్కువ. ఇది మ్యూచువల్ ఫండ్స్ కంటే మెరుగైన ఖర్చు తగ్గింపులో మేటిగా నిలుస్తుంది.
2. లిక్విడిటీ
సాధారణంగా డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లిక్విడిటీ తక్కువగా ఉంటాయి. కానీ, Debt ETFs స్టాక్ మార్కెట్‌లో సులభంగా కొనుగోలు చేయొచ్చు లేదా విక్రయించవచ్చు.
3. స్థిర ఆదాయం
పెట్టుబడిదారులు మార్కెట్‌లో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు కూడా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.
4. టాక్స్ బెనిఫిట్స్
డెట్ ETFs పై లాంగ్-టర్మ క్యాపిటల్ గెయిన్స్ పన్ను అనుసరించబడుతుంది, ఇది పెట్టుబడిదారుల కోసం ప్రయోజనకరమైనది.
Debt ETFs ఎలా పనిచేస్తాయి?
1. ఆస్తుల ఎంపిక:
ఫండ్ మేనేజర్లు డెట్ ఇన్స్ట్రుమెంట్స్ (జీవిత కాలం, రేటింగ్, దిగుబడి ఆధారంగా)ను ఎంచుకుంటారు.
2. డైవర్సిఫికేషన్:
Debt ETFs డైవర్స్ పెట్టుబడులను కలిగి ఉంటాయి, అంటే నష్టాల రిస్క్ తక్కువ.
3. రాబడులు:
పెట్టుబడిదారులు బాండ్లపై పొందే వడ్డీ ఆదాయాన్ని స్థిరంగా పొందుతారు.
Debt ETFs లాభాలు
1. మొదటిసారి వచ్చే పెట్టుబడిదారులకు ఈజీగా ఉంటాయి
స్టాక్ మార్కెట్‌లో కొత్తగా ప్రవేశించేవారికి డెట్ ETFs అనేవి మంచి ఇన్వెస్టుమెంట్ సాధనాలని చెప్పొచ్చు.
2. రిస్కు తక్కువ
అధిక రిస్కును భరించలేము అని భావించే వారికి ఇవి ఒక సురక్షితమైన పెట్టుబడి ఎంపిక అవుతుంది.
3. ట్రాకింగ్
డెట్ మార్కెట్‌ను నిరంతరం పర్యవేక్షించడం కష్టం అనుకునే వారికి మార్కెట్ హెచ్చు తగ్గులతో సంబంధం లేకుండా పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి.
4. ఫైనాన్షియల్ ప్లానింగ్
Debt పెట్టుబడుల ద్వారా లాంగ్-టర్మ్ గోల్స్‌కు చేరుకోవచ్చు.
Debt ETFs ఎవరికి ఉపయోగం ?
ప్రారంభ పెట్టుబడిదారులు: మార్కెట్‌ను అన్వేషించాలనుకునేవారికి.
రెగ్యులర్ ఆదాయం కోరుకునేవారు :
తక్కువ వడ్డీ రేటు ఉన్నప్పటికీ స్థిరమైన ఆదాయం కొరుకునే వారికి ఉపయోగపడతాయి.
సురక్షిత పెట్టుబడులు కోరుకునే వ్యక్తులు:
నష్టాల ప్రమాదం తక్కువగా ఉండే వారికి ఇవి అనుకూలం.
Debt ETFs పెట్టుబడిలో ఆచరించాల్సిన ముఖ్య సూచన
1. గోల్స్ ను స్పష్టంగా నిర్ణయించుకోండి
మీ పెట్టుబడి లక్ష్యం స్థిర ఆదాయమా లేక డైవర్సిఫికేషన్‌నా అనేది ముందుగానే నిర్ణయించుకోండి.
2. డెట్ etfs లో పెట్టే ముందు ఆ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోండి.
ETFs లో ఉన్న బాండ్స్ రేటింగ్, మేచ్యూరిటీ డేట్‌లు వంటి వివరాలను సమగ్రంగా.. పరిశీలించండి.
3. ఫీజులు పరిశీలించండి
తక్కువ ఖర్చులు ఉన్న ఫండ్స్ ను ఎంపిక చేయడం ఉత్తమం.
4. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించండి
Groww, Zerodha, Paytm Money వంటి ప్లాట్‌ఫారమ్స్ ద్వారా సులభంగా డెట్ ETFs లో పెట్టుబడి పెట్టవచ్చు.
best debt etfs india
Debt ETFs లో పెట్టుబడి పెట్టే ప్రముఖ ఫండ్స్
1. Nippon India ETF Long Term Gilt
2. Edelweiss Bharat Bond ETF
3. SBI ETF 10 Year Gilt
4. HDFC Banking & PSU Debt ETF
వీటితోపాటు మరికొన్ని etf లను పరిశీలించండి.
Debt ETFs ఫ్యూచర్ ట్రెండ్స్ పెరుగుతున్నాయి వాటిలో ఒకటి
ESG (Environmental, Social, Governance) Debt ETFs
ఇన్వెస్టర్ల అవగాహన కోసం మాత్రమే ఈ విశ్లేషణ
Debt ETFs: అనేవి సురక్షితమైన మరియు స్థిరమైన ఆదాయం పొందాలని కోరుకొనే పెట్టుబడిదారులకు మంచి పెట్టుబడి సాధనాలుగా నిలుస్తున్నాయి. తక్కువ ఖర్చులు, లిక్విడిటీ, మరియు డైవర్స్ పెట్టుబడులు వంటి ప్రయోజనాలు వీటిని ప్రత్యేకంగా నిలిపాయి అనడంలో ఎటువంటి సందేహమూ అక్కరలేదు.
మీ పెట్టుబడుల కోసం Debt ETFs అనేవి ఉత్తమమైనవి కావచ్చు. సరైన ప్లానింగ్ తో ముందుకెళ్తే లక్ష్యాలను చేరుకోవచ్చు.