ETF News Telugu

Auto Sector Etf Funds : భవిష్యత్తులో ఆటో సెక్టార్ ఈటిఎఫ్ లు ఎలా ఉండబోతున్నాయి..?

Auto Sector Etf : రాబోయే రోజుల్లో ఆటో మొబైల్ పరిశ్రమ వృద్ధి ఆశాజనకంగా ఉండబోతుంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ సెగ్మెంట్ లోకి పెద్ద కంపెనీలు దేశీయ అవసరాల కనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ వ్యూహాత్మకంగా చర్యలు చేపడుతున్నారు.

ఒక్క కార్లు మాత్రమే కాకుండా .. బస్ లు, లారీలు, స్కూల్ వ్యాన్ లు, ఆటో లు, బైక్ లు, ఇలా పలు రకాల పాసింజర్ వెహికల్స్ విభాగం మరియు ట్రాన్స్పోర్ట్ విభాగంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా వేగంగా రోడ్డు మీదకు వచ్చేస్తున్నాయి.

ఇప్పటి నుండి ఆటో మొబైల్ వృద్ధి కేవలం EV లోనే కాక ఆయిల్ ఇంజిన్ సెక్టార్ పరిశ్రమ లో కూడా వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఒక్క వెహికల్స్ విభాగం లోనే కాక ఆటో విడిభాగాలు తయారు చేసే కంపెనీలు, బ్యాటరీలు, టైర్ తదితర విభాగాల్లో ఉన్న కంపెనీలు కూడా లాభం పొంద బోతున్నాయి.

ఇలాంటి ఎన్నో కంపెనీలు ఈ సెక్టార్ లో లాభపడ బోతున్నాయి. అలాంటి అన్ని కంపెనీలలో మనం షేర్లు కొని వాటిని ట్రాక్ చెయ్యడం అంత సులభం కాదు. అందుకే ఈ సెగ్మెంట్ లో ఉన్న మెజారిటీ లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీలలో .. పెట్టుబడులు కొనసాగిస్తూ.. ఎప్పటికప్పుడు గ్రోత్ కి అవకాశం బాగా ఉన్న కంపెనీల స్టాక్స్ లో పెట్టుబడికి ఉన్న కొన్ని అవకాశాలను ఇప్పుడు చూద్దాం.

వాటిల్లో మనకు ఉన్న మార్గాల్లో ఒకటి ETF funds వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ ద్వారా పైన చెప్పుకున్న విధంగా.. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను ఒక  ETF ద్వారా మనం కొనొచ్చు.. దాని ద్వారా ఈ పరిశ్రమ వృద్ధి లో వచ్చే లాభాలను వడిసి పట్టుకోడానికి అవకాశం కలుగుతుంది . అలాంటి కొన్ని ETF ఫండ్స్ ను చూద్ధాం.

Auto Mobile ETF funds

AUTOBEES : Nippon india Nifty Auto ETF

25 జనవరి 2022 లో నిఫ్టీ లో లిస్ట్ అయిన ఈ ఈటిఎఫ్ మార్కెట్ క్యాప్ – 316.81 కోట్లు గా ఉంది.

ప్రస్తుత ధర : 236.38

52 వారాల గరిష్ఠ ధర : 285.00

52 వారాల కనిష్ఠ ధర : 184.37

ఒక సంవత్సర కాలంలో ఇచ్చిన లాభం : 23%

రెండు సంవత్సరాల కాలంలో ఇచ్చిన లాభం : 35%

ఈ ETF ఫండ్ లో రోజు వారీ వాల్యూమ్స్ బాగుండటం వలన కొనుగోలు , అమ్మకం సులభంగా చేసుకోవచ్చు. తద్వారా ఇన్వెస్టర్ల కి లిక్విడిటీ సమస్య అనేది ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా క్యాష్ చేసుకునే వీలుండటం ఈ etf fund ప్రత్యేకత.

AUTOIETF : ICICI Prudential Nifty Auto ETF

18 జనవరి 2022 నిఫ్టీ లో లిస్ట్ అయిన ఈ ఈటిఎఫ్ మార్కెట్ క్యాప్ – 117.74 కోట్లు గా ఉంది.

ప్రస్తుత ధర : 23.65

52 వారాల గరిష్ఠ ధర : 28.36

52 వారాల కనిష్ఠ ధర : 18.10

ఒక సంవత్సర కాలంలో ఇచ్చిన లాభం : 23%

ఈ ETF ఫండ్ లో కూడా లిక్విడిటీ సమస్య లేదు రిటర్న్స్ పరంగా కూడా బాగానే ఇచ్చింది. మనం ETF కొనే ముందు ఫండ్ హౌస్ ను బట్టి రిటర్న్స్ లో కొంచెం తేడా ఉండొచ్చు .. కానీ లిక్విడిటీ పరంగా రెండూ కూడా మంచి ఎంపికనే చెప్పొచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్ కేవలం మదుపరుల అవగాహన కోసం మాత్రమే .. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల అభిప్రాయం తీసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ETF News Telugu