భారతదేశంలో ఆయిల్ & గ్యాస్ సెక్టార్ ETF ఫండ్స్ గతంలో ఎలాంటి లాభాలను అందించాయి. భవిష్యత్తులో ఈ సెక్టార్ ఎలా ఉండబోతుంది లాంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఆయిల్ మరియు గ్యాస్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఇంధన వనరుల అవసరం రోజురోజుకు పెరుగుతుండటంతో.. ఈ రంగంలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి.
ఎలక్ట్రికల్ వెహికల్స్ వృద్ధి బాటలో పయనిస్తున్నప్పటికి పూర్తి స్థాయిలో EV రంగం డెవెలప్ అయ్యేసరికి ఎంత లేదన్నా కనీసం పదేళ్లు అయినా పడుతుంది.
పైగా భారత్ లో ఈవి స్టేషన్స్ కొరత చాలా ఉంది. ఇప్పుడున్న వెహికల్ ప్రయాణ రేంజి కూడా ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. ఈ లోపు సరికొత్త ఫ్యూయల్ టెక్నాలజీ లు డెవెలప్ చేస్తూనే ఉన్నారు.
ఉదాహరణకు.. నైట్రోజన్ ఫ్యూయల్ ను ఇప్పటికే కొన్ని దేశాలలో వాడుతున్నారు. వీటన్నింటిని పరిగణన లోకి తీసుకొని రాబోయే రోజుల్లో ఏది మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేస్తారో దానికి తగ్గట్లు మార్పు చెందాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఒకెత్తయితే..
ఆయిల్ కంజెప్షన్ ఒక్క ట్రాన్స్పోర్ట్ అవసరాలకే కాక ఇండస్ట్రియల్ అవసరాలకు కూడా ఎక్కువగానే వాడతారు కాబట్టి.. రాబోయే పది సంవత్సరాల పాటు ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలు బాగానే అర్జిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఎక్షేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs)ద్వారా ఈ రంగంలోని ప్రధాన కంపెనీలలో నేరుగా పెట్టుబడి చేయవచ్చు.

ఆయిల్ & గ్యాస్ సెక్టార్ ETF అంటే ఏమిటి?
ఆయిల్ & గ్యాస్ సెక్టార్ ETFలు ఆయిల్, గ్యాస్, మరియు ఎనర్జీ రంగంలో పనిచేస్తున్న ప్రముఖ కంపెనీల షేర్లను ట్రాక్ చేస్తాయి. ఈ ETFలు ఈ రంగంలో పెట్టుబడులు చేయడానికి సరళమైన మార్గం అందిస్తాయి. ఈ రంగానికి సంబంధించి వ్యాపారాలు చేసే కంపెనీల పనితీరును ఆధారంగా చేసుకుని పెట్టుబడిదారులు లాభాలను పొందగలరు.
ప్రముఖ ఆయిల్ & గ్యాస్ సెక్టార్ కంపెనీలు
ICICI Prudential Nifty Oil & Gas ETF ( INF109KC18W3)
ప్రస్తుత ధర : 10.78
52 వారాల గరిష్ఠ ధర : 14.00
52 వారాల కనిష్ఠ ధర : 10.39
I Nav ధర: 10.72
మార్కెట్ క్యాప్ : 154.48 కోట్లు
ఈ ETF ప్రస్తుత ట్రేడింగ్ ధర .. i nav కి దగ్గరగా ట్రేడ్ అవుతుంది. మంచి వాల్యువేషన్ లోనే ఉంది. కానీ ఈ ఈటీఎఫ్ జులై 2024 నెలలోనే లిస్ట్ అయ్యింది కాబట్టి ఇప్పటికిప్పుడు ఎక్కువ లాభాలను పరిగణనలోకి తీసుకోలేం .. పీర్స్ కూడా లేవు కాబట్టి .. లాభాలను పరిగణనలోకి తీసుకోలేం .. మున్ముందు మరిన్ని ETF funds ఈ సెక్టార్ లో రావొచ్చు. ఈ సెక్టార్ లోకి చిన్న కంపెనీలు రావడం అసాధ్యం కనుక పెద్ద కంపెనీలే ఇక్కడ ఉన్నాయి. నిలకడైన వృద్ధికి అవకాశం ఉంది కనుక ఇన్వెస్ట్మెంట్స్ నిర్ణయాన్ని ఆలోచించవచ్చు.
ఆయిల్ అండ్ గ్యాస్ రంగానికి సంబంధించిన ప్రధాన కంపెనీలలో స్టాక్స్ కొనుగోలు చేస్తారు.
ఈ రంగంలో ఉన్న కంపెనీల వృద్ధి కి అనుగుణంగా ఈ ETF లాభాలను ఇస్తుంది.
ఆయిల్ & గ్యాస్ భవిషత్తు
అవసరం:
ఆయిల్ మరియు గ్యాస్ వనరులపై ఆధారపడటం ఇప్పటికీ కొనసాగుతోంది, దీనితో ఈ రంగానికి స్థిరమైన డిమాండ్ ఉంటుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్ సప్లయి ఆధారంగా హెచ్చు తగ్గులు ఉండొచ్చు
కార్పొరేట్ వృద్ధి :
Reliance Industries, ONGC వంటి కంపెనీలు ఈ రంగంలో తమ పనితీరు ద్వారా పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందిస్తున్నాయి.
డైవర్సిఫికేషన్
ఒకే ETFలో అనేక కంపెనీల షేర్లను కలిగి ఉండటం ద్వారా పెట్టుబడిదారులు రిస్క్‌ను తగ్గించుకోవచ్చు.
లిక్విడిటీ
స్టాక్ మార్కెట్‌లో ETFలు సులభంగా ట్రేడ్ చేయవచ్చు.
నిర్వహణ ఖర్చు
ఆయిల్ & గ్యాస్ రంగంలోని మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే ETFల నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది.
లాంగ్ టర్మ్ లాభాలు
దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈ రంగం మంచి వృద్ధి అవకాశాలను అందిస్తుంది.
సెక్టార్ రిస్కు
అంతర్జాతీయ ధరల ప్రభావం
క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో మార్పులకు లోనవుతుంటాయి.
పర్యావరణ నియమాలు
గ్లోబల్ వార్మింగ్ మరియు పర్యావరణ హానీ తది తరాలు ఈ రంగం వ్యాపారాలను ప్రభావితం చేయవచ్చు.
ఎవరికి ఈ ETFలు సరైనవి?
దీర్ఘకాలిక పెట్టుబడిదారులు
ఆయిల్ అండ్ గ్యాస్ రంగంపై నమ్మకం ఉన్నవారు
పోర్ట్ ఫోలియో డైవర్సిఫికేషన్ కోరుకునే వారు
ఆయిల్ & గ్యాస్ రంగం భారత మార్కెట్లో కీలకమైన విభాగం. ఈ రంగానికి సంబంధించి సరైన అవగాహనతో పెట్టుబడులు చేస్తే లాభాలు పొందవచ్చు. ETFలలో పెట్టుబడి పెట్టడం పెట్టుబడిదారులకు సరళమైన మరియు ఖర్చుల పరంగా కలసి వస్తుంది. అయితే పెట్టుబడి చేసే ముందు మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ ప్రభావాలు, కంపెనీ ETF funds యొక్క పనితీరు వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవడం అవసరం.
గమనిక: మీ పెట్టుబడులను పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి.