ఇండియాలో ప్రముఖ సెక్టార్ కేటగిరి ETF ఫండ్స్ గురించి తెలుసుకుందాం.
ఇండియా మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే విధానాలు రోజు రోజుకూ మారిపోతున్నాయి. వీటిలో Exchange Traded Funds (ETFs) లు ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీగా మారాయి. ETFలు పెట్టుబడిదారులకు స్టాక్ మార్కెట్లో వివిధ విభాగాల (సెక్టార్) పై నేరుగా పెట్టుబడి పెట్టే అవకాశాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా.. సెక్టార్ కేటగిరి ETFలు ఓ ప్రత్యేక రంగానికి చెందిన కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టడానికి రూపొందించబడతాయి.
సెక్టార్ కేటగిరి ETF అంటే ఏంటి..?
సెక్టార్ కేటగిరి ETFలు మార్కెట్లో ఒక ప్రత్యేక రంగానికి చెందిన షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకు.. బ్యాంకింగ్ రంగం, ఐటీ రంగం, ఫార్మా రంగం వంటి రంగాలకు చెందిన షేర్ల లో ఈ ETF లు ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంటాయి. ఒకే రంగంలో పెట్టుబడికి ఇష్టపడే వారికి ఈ ETF ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి.

కొన్ని సమయాలలో కొన్ని ఇండస్ట్రీలలో మాత్రమే అధిక వృద్ధిని చూస్తుంటాం. లేదా ఫ్యూచర్ లో కొన్ని రంగాలు అద్భుత మయిన వృద్ధి నమోదు చెయ్యొచ్చు అన్నా అంచనాలతో ఉంటాం. దానికి ముఖ్యంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం కావొచ్చు , లేదా ప్రపంచ దేశాల నుండి ఉండే ప్రోత్సాహం, సామజకీకరణ కావొచ్చు ..
ఏదైతేనేం ఒక్కో సారి కొన్ని ఇండస్ట్రీస్ బాగా లాభాలు పంచుతుంటాయి. అలాంటి కంపెనీల స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయటం వలన మన సంపదను పెంచుకోవచ్చు. అలాంటి అవకాశం ఈ ఈటీఎఫ్ ఫండ్స్ కలిగిస్తాయి.
భారత్ లో ప్రముఖ సెక్టార్ కేటగిరి ETF లు ఏంటో చూద్దాం..
1. బ్యాంకింగ్ సెక్టార్ ETFలు
బ్యాంకింగ్ రంగం అనేది ఇండియన్ ఎకానమీకి కీలకమైన విభాగం.
SBI ETF Nifty Bank, ICICI Prudential Bank ETF వంటి ఫండ్స్ ప్రముఖంగా ఉన్నాయి.
ఈ ETFలు ప్రధానంగా Nifty Bank ఇండెక్స్‌లో ఉన్న టాప్ బ్యాంక్స్ (SBI, HDFC Bank, ICICI Bank) షేర్లను ట్రాక్ చేస్తాయి.
2. ఆయిల్ & గ్యాస్ సెక్టార్ ETFలు
భారత దేశంలో ఎనర్జీ రంగం మరింత ప్రాధాన్యం పొందుతుంది.
Reliance ETF Shale Oil, Nifty Energy ETF వంటి ఫండ్స్ ఇంధన రంగానికి సంబంధించిన పెట్టుబడులను అందిస్తాయి.
3. IT సెక్టార్ ETFలు
ఇండియాలో టెక్నాలజీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నది.
ICICI Prudential IT ETF, Nifty IT ETF వంటి ఫండ్స్ ముఖ్యమైన ఐటీ కంపెనీల షేర్లలో పెట్టుబడి చేయగల అవకాశాన్ని ఇస్తాయి.
TCS, Infosys, Wipro వంటి కంపెనీలు ప్రధానమైన వాటి జాబితాలో ఉంటాయి.
4. ఫార్మా సెక్టార్ ETFలు
ఆరోగ్య రంగానికి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఫార్మా రంగంలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి.
Nippon India ETF Pharma BeES, ICICI Prudential Pharma ETF వంటి ఫండ్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీల షేర్లను ట్రాక్ చేస్తాయి.
5. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ETFలు
భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి చాలా ముఖ్యమైనది. ఈ రంగంలో ఉన్న కొన్ని ETF funds ఏంటో చూద్దాం..
CPSE ETF, ICICI Prudential Infra ETF వంటి ఫండ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి సంబంధించిన కంపెనీలలో పెట్టుబడులు చేస్తాయి.

సెక్టార్ కేటగిరి ETF లలో ఇన్వెస్ట్మెంట్స్ ఉపయోగాలు తెలుసుకుందాం.
డైవర్సిఫికేషన్
ఒకే రంగంలోని అనేక కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా రిస్క్ తగ్గుతుంది.
ట్రేడింగ్
ETFలు స్టాక్ మార్కెట్లో నేరుగా ట్రేడ్ చేయవచ్చు, కనుక వీటి లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది.
ఎక్స్ పెన్స్ రేషియో
ETFల నిర్వహణ ఖర్చులు కంటే తక్కువగా ఉంటాయి, సాధారణ మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే.

దీర్ఘకాలిక లాభాలు
సెక్టార్ పట్ల సరైన అవగాహన ఉంటే దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందవచ్చు.
ఒక ఇన్వెస్టర్ గా మీరు ఆయా సెక్టార్ యొక్క గ్రోత్ ఎలా ఉంది అనే విషయాల మీద కూలంకుషంగా అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.
సెక్టార్‌ను విశ్లేషణ
పెట్టుబడి చేయబోయే రంగానికి సంబంధించిన ట్రెండ్‌ను అధ్యయనం చేయడం ముఖ్యం.
ETF రీసెర్చ్
గత కాలంలో ETFల పనితీరు, నష్టాలు, లాభాలపై విశ్లేషణ చేయాలి.
ఫైనాన్షియల్ గోల్స్

పూర్తి అవగాహనతో నిర్ణయం తీసుకోండి
ఆర్థిక లక్ష్యాలను పెట్టుకోండి. పెట్టుబడికి మీరు వినియోగించే సొమ్ము ఎంత కాలానికి పెట్టాలనుకుంటున్నారో .. ముందే నిర్ణయించుకోండి. అప్పుడే మీరు దీర్ఘ కాలంలో వచ్చే లాభాలను పొందగలరు.
ఎగ్జాంపుల్
మీకు బ్యాంకింగ్ రంగంపై నమ్మకం ఉంటే, Nifty Bank ETFలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు లాభాలు పొందగలరు. అలాగే, IT రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున Nifty IT ETFలు కూడా మంచి ఎంపిక కావచ్చు.
సెక్టార్ కేటగిరి ETFలు పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకమైన అవకాశాలను అందిస్తున్నాయి. సరైన రంగాన్ని ఎంపిక చేసుకోవడం, దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి చేయడం ద్వారా మీ సంపదను పెంచుకోవచ్చు. భారతీయ మార్కెట్ అభివృద్ధి చెందుతున్నందున, ETFలు మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది.

గమనిక:
ఇలాంటి పెట్టుబడులు చేయడానికి మీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌తో మాట్లాడి మీ అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోండి.