మిడ్ క్యాప్ ETF ఫండ్స్ గురుంచి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మిడ్ క్యాప్ ETF (Exchange Traded Funds) ఫండ్స్ అనేవి స్టాక్ మార్కెట్‌లో మిడ్ క్యాప్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్. ఇవి. NSE స్టాక్ ఎక్చేంజ్ లోని మిడ్ క్యాప్ కంపెనీలకు సంబంధించిన ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. లార్జ్ క్యాప్ తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో (NSE) 101వ స్థానం నుండి 250వ స్థానం మధ్యలో ఉన్న కంపెనీలుగా చెప్పుకోవచ్చు. ఇవి పెద్ద కంపెనీల కన్నా ఎక్కువ గ్రోత్ ఉండే అవకాశం ఉంది. కానీ రిస్క్ కూడా అలాగే ఉంటుంది.
మిడ్ క్యాప్ ETF ఫండ్స్ ఉపయోగాలు ఏంటి..?
డైవర్సిఫికేషన్
మిడ్ క్యాప్ ETF లు పలు వైవిధ్య రంగాల మిడ్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం వల్ల డైవర్సిఫికేషన్ ను అందిస్తాయి.
ఎక్స్ పెన్స్ రేషియో
ఇన్వెస్టర్లు చాలా తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియోతో వీటిలో ఇన్వెస్ట్ చేయవచ్చు.
లిక్విడిటీ
ఈ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ద్వారా ఎప్పుడైనా కొనుగోలు లేదా అమ్మకం చేయవచ్చు. ఎందుకంటే .. ఈ etf లలో వాల్యూమ్స్ ఎక్కువగా ఉంటాయి.
గ్రోత్ ఆపర్చునిటీ
మిడ్ క్యాప్ కంపెనీలు కొత్త మార్కెట్లలో విస్తరణకు లేదా ఆర్థికమైన బలాన్ని పెంపొందించేందుకు ఎక్కువ అవకాశాలను కలిగి ఉంటాయి.
ఫండ్ హౌస్ లు
మిడ్ క్యాప్ ETFలను భారతదేశంలోని కొన్ని ప్రముఖ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (AMCs) నిర్వహిస్తాయి. ఈ సంస్థలు నిపుణులైన ఫండ్ మేనేజర్ల ద్వారా మిడ్ క్యాప్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టి ఇండెక్స్‌ను ఫాలో అవుతూ కంపెనీల పని తీరును పర్యవేక్షిస్తుంటారు కాబట్టి లాభాలు ఆర్జించే స్టాక్స్ ను మాత్రమే ఉంచుతారు.ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించడానికి ప్రయత్నిస్తుంటారు.
ప్రముఖ మిడ్ క్యాప్ ETF ఫండ్స్ మరియు వాటిని నిర్వహిస్తున్న AMC లు ఏంటో చూద్దాం..

1. Nippon India ETF Nifty Midcap 150
నిర్వహణ హౌస్: Nippon India Mutual Fund
ఇది Nifty Midcap 150 ఇండెక్స్‌ను ఫాలో అవుతుంది. ఇది మంచి డైవర్సిఫికేషన్ మరియు లాంగ్ టర్మ్ గ్రోత్ అందిస్తుంది.
ప్రస్తుత ధర : 216.00
52 వారాల గరిష్టం: 235.65
52 వారాల కనిష్టం: 170.01
మార్కెట్ క్యాప్: 1901.24 Cr

2. Motilal Oswal Midcap 100 ETF
నిర్వహణ హౌస్: Motilal Oswal Asset Management
ఇది Nifty Midcap 100 ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తుంది. ఎక్కువగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఉంటుంది.
ప్రస్తుత ధర : 61.80
52 వారాల గరిష్టం: 66.45
52 వారాల కనిష్టం: 48.19
మార్కెట్ క్యాప్: 560.24 Cr

3. ICICI Prudential Midcap 150 ETF
నిర్వహణ హౌస్: ICICI Prudential Mutual Fund
ఇది కూడా Nifty Midcap 150 ఇండెక్స్‌ను అనుసరిస్తుంది మరియు తక్కువ ఖర్చుతో మంచి రాబడులను అందిస్తుంది.
ప్రస్తుత ధర : 21.66
52 వారాల గరిష్టం: 23.70
52 వారాల కనిష్టం: 17.12
మార్కెట్ క్యాప్: 439.66 Cr
ఎవరికి మిడ్ క్యాప్ ETFలు అనుకూలం..?
లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు: దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఇది సరైన ఎంపిక.
సాధారణ రిస్క్ భరించగలవారు: మిడ్ క్యాప్ కంపెనీల రిస్క్‌ను భరించగల ఇన్వెస్టర్లకు ఇది బాగా అనుకూలిస్తుంది.
డైవర్సిఫికేషన్ : ఒకే ఫండ్‌లో అనేక రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడికి అవకాశం ఉండటం
మిడ్ క్యాప్ ETFల
Etf ఇండెక్స్: ఫండ్ అనుసరించే ఇండెక్స్ పనితీరు చరిత్రను విశ్లేషించుకొని నిర్ణయం తీసుకోండి
ఎక్స్‌పెన్స్ రేషియో: తక్కువ ఖర్చుతో ఉన్న ఫండ్స్ ఎంచుకోవడం మంచిది.
ETF హిస్టరీ: గత కాలంలో ఫండ్ సాధించిన రాబడులను గమనించండి.
మిడ్ క్యాప్ ETFలు చిన్న ఇన్వెస్టర్లు నుండి పెద్ద ఇన్వెస్టర్ల వరకు అందరికి సరిపోయే విధంగా డిజైన్ చేయబడ్డాయి. రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటే, డైవర్సిఫికేషన్, లిక్విడిటీ, మరియు తక్కువ ఖర్చుతో పాటు మంచి రాబడులు అందించగల మిడ్ క్యాప్ ETFలు మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోకు మేలైన అదనంగా మారవచ్చు. కాబట్టి, మీ పెట్టుబడులకు ముందు సరైన పరిశీలన చేయడం ముఖ్యం.
Disclaimer:
పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ మీద అవగాహన పెంచుకోండి. లేదా నిపుణుల అభిప్రాయాలను తీసుకోండి.