Bank Nifty Bees ETF BANKBEES గత ఐదేళ్ల పెర్ఫార్మెన్స్:
2019 వ సంవత్సరం నుండి బ్యాంక్ నిఫ్టీ ఈటిఎఫ్ రిటర్న్స్ పరంగా ఎలాంటి లాభాలు అందించిందో ఇప్పుడు చూద్దాం..
Bank Nifty Bees ETF అనేది నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌ను ట్రాక్ చేసే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్.

ఈ ETF ఫండ్ ను నిర్వహిస్తున్నది నిప్పాన్ ఇండియా వారు
ఫండ్ కోడ్ : BANKBEES
ప్రస్తుత ధర : 527.00
52 వారాల గరిష్ఠం : 558.78
52 వారాల కనిష్టం : 453.80
మార్కెట్ క్యాప్ : 7389.72 cr
ఈ ETF ప్రధానంగా.. కొత్త ఇన్వెస్టర్స్ లేదా నిఫ్టీ బ్యాంకింగ్ రంగం పై ఆసక్తి ఉన్నవారు గ్రూప్ ఆఫ్ బ్యాంకుల అస్సెట్స్ లో తమ పెట్టుబడులను కొనసాగించాలని కోరుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది అని చెప్పొచ్చు.
Bank Nifty Bees ETF – ఏమిటి?
Bank Nifty Bees ETF భారతదేశంలో ప్రధానమైన బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన 12 టాప్ బ్యాంకుల పనితీరును ట్రాక్ చేస్తుంది. ఇది లాంచ్ అయ్యింది 2004 లో.. అప్పటి నుండి బ్యాంకింగ్ సెక్టార్ లో పెట్టుబడులు బాగా పెరిగాయి.
ఒకే బ్యాంక్ షేర్ కొనడం వల్ల అధిక రిస్కును ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదే గ్రూప్ ఆఫ్ బ్యాంకులు కలిసిన ఈ ETF లో పెట్టుబడుల వలన రిస్కు ను కొంత మేర తగ్గించుకోవచ్చు . లాభాలు కూడా నిలకడగా ఉంటాయి. భారీగా పెరగటం లేదా తగ్గటం etf లలో మనం చూడలేము. ఎందుకంటే ఎక్కువ బ్యాంకులు ఈ etf లో ఉండటం వల్ల ఒక బ్యాంక్ షేర్ తగ్గినా మిగతా బ్యాంకులు లాభాలు అందిస్తాయి గనుక. రోజు వారీ పనులతో బిజీగా ఉండే వారికి బ్యాంక్ ETF అనేది మంచి ఎంపికగా చెప్పొచ్చు.అంతే కాక మంచి రాబడులు కూడా అందించింది.
గత ఐదేళ్లలో Bank Nifty Bees ETF పనితీరు (2019-2024) ఎలా ఉందో చూద్దాం..
2019:
2019లో, దేశీయ ఆర్థిక వ్యవస్థలో పెరుగుదల బాగానే ఉంది. ముఖ్యంగా.. బ్యాంకింగ్ రంగం స్థిరంగా పెరుగుదలను చూపించింది. ఆ సంవత్సరం Bank Nifty Bees ETF సుమారు 12-15% రిటర్న్స్ ఇచ్చింది.
2020:
కోవిడ్-19 పాండెమిక్ ప్రభావం బ్యాంకింగ్ రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. మార్కెట్లలో ఉన్న వోలటాలిటి కారణంగా, ETF విలువ 20-25% తగ్గిపోయింది. కానీ, అదే ఏడాది చివరికి బ్యాంకింగ్ రంగం కోలుకొని నష్టపోయిన సంపదను తిరిగి రాబట్టింది. ఇక్కడ మరొక విషయాన్ని మనం ప్రస్థావించు కావాలి .. స్టాక్ మార్కెట్లు కరీనా కారణంగా భారీగా పద్దప్పటికి మళ్ళీ సెన్సెక్స్, నిఫ్టీ index లు కోలుకోడానికి సుమారు ఆరు నెలలు పట్టింది.. దాంతో ETF funds కూడా వెంటనే కోలుకున్నాయి ఎందుకంటే ప్రతి ETF ఫండ్ కూడా index లను ఫాలో అవుతాయి కాబట్టి. అదే ఒక స్టాక్ విషయానికి వస్తే.. కొన్ని ఫండమెంటల్స్ బాగున్న స్టాక్స్ త్వరగా కోలుకున్నప్పటికీ సరైన ఫండమెంటల్స్ లేనివి , స్మాల్ , మిడ్ క్యాప్ లోని కొన్ని స్టాక్స్ తిరిగి కొలుకోడానికి కొన్ని సుమారు రెండు నుండి మూడు సంవత్సరాలు పట్టింది. అందుకే ETF funds అనేవి ఇన్వెస్టర్ లకు గణనీయమైన లాభాలను అందించాయి.
2021:
బ్యాంకింగ్ రంగం మరియు ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కారణంగా, 2021లో ఈ ETF సుమారు 30% వరకు మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఏడాది కాలంలో ఈ ఫండ్ బుల్ మార్కెట్ లో వచ్చిన లాభాలను ఇన్వెస్టర్ లకు అందించింది.
2022:
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మారడం మరియు అమెరికా ఫెడ్ పాలసీ మార్పుల కారణంగా, మార్కెట్ కొంత ఒత్తిడిలో ఉంది. అయినప్పటికీ, Bank Nifty Bees ETF సుమారు 15-18% రిటర్న్స్ ఇచ్చింది. మార్కెట్ అనిశ్చితిని తట్టుకొని మంచి లాభాలను అందించింది.
2023-2024:
ఈ కాలంలో బ్యాంకింగ్ రంగం మరింత స్థిరంగా ఉండటం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం Bank Nifty Bees ETF కి గణనీయమైన వృద్ధిని ఇచ్చింది. 2024 ప్రారంభ నాటికి ఇది 20% పైగా రిటర్న్స్ అందించింది.
Bank Nifty Bees ETFలో పెట్టుబడి ఎందుకు చేయాలి?
డైవర్సిఫికేషన్: లార్జ్ క్యాప్ బ్యాంకుల పనితీరు బాగుండటం వలన స్థిరమైన వృద్ధికి ఆస్కారం ఉంది.
లిక్విడిటీ: మార్కెట్లో ప్రతి రోజు ఈ కౌంటర్ లో వాల్యూమ్స్ బాగుంటాయి.. దాదాపు ప్రతి ట్రేడింగ్ సెషన్ లోనూ .. అమ్మకాలు , కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. మనం ఎప్పుడు కావాలన్నా ఈజీగా క్యాష్ చేసుకోవచ్చు.
ఖర్చు తక్కువ: ఇతర మ్యూచువల్ ఫండ్‌లతో పోలిస్తే etf funds లో యక్ష్పెన్స్ రేషియో ఖర్చు తక్కువగా ఉంటుంది.
Bank Nifty Bees ETF: ఇన్వెస్టర్స్ గుర్తుంచు కోవలసిన ముఖ్య విషయాలు ఏంటంటే..!
దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి ఎంపిక. ఐదు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు మదుపు చేద్దాం అనుకునే వారికి మంచి లాభాలను చూడొచ్చు.
మార్కెట్ వోలటాలిటీని ఎదుర్కొనే ఇన్వెస్టర్లు దీన్ని ఎంపిక చేసుకోవచ్చు.
ప్రతి సంవత్సరం దీని పనితీరును పరిశీలించి, అవసరమైనప్పుడు రీబ్యాలెన్స్ చేసినట్లయితే ఇంకొంత మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుంది.
Bank Nifty Bees ETF గత ఐదేళ్లలో ఒక స్థిరమైన పెరుగుదలను చూపించింది. ఇది మరిన్ని ఆకర్షణీయమైన పెట్టుబడులకు అవకాశాలను అందించగలదు. బ్యాంకింగ్ రంగంపై నమ్మకం ఉన్నవారికి ఇది ఒక మంచి ఎంపిక. లాంగ్‌టర్మ్ కి ప్లాన్ చేసే.. ఇన్వెస్టర్లు దీన్ని వారి పోర్ట్‌ఫోలియోలో భాగం చేసుకోవచ్చు.