ETF News Telugu

Top 10 ETF funds 2024 SBI Nifty IT Index ETF ఎస్ బి ఐ నిఫ్టీ ఐటి ఇండెక్స్ ఈటిఎఫ్

Top 10 ETF funds 2024 SBI Nifty IT Index ETF

 

Top 10 ETF funds 2024 SBI Nifty IT Index ETF
Top 10 ETF funds 2024 SBI Nifty IT Index ETF
SBI Nifty IT Index ETF

Top 10 ETF funds 2024 SBI Nifty IT Index ETF

SBI ETF Nifty IT Index (SBIETFIT)

5. SBI ETF Nifty IT Index భారతదేశంలో ప్రముఖ IT కంపెనీల పనితీరును ప్రతిబింబించే ఇండెక్స్ ఇది ఎక్చేంజ్ ట్రేడింగ్ ఫండ్ (ETF) రూపంలో అందుబాటులో ఉంటుంది, దీని ద్వారా మదుపరులు IT రంగానికి సంబంధించిన విభాగంలో చురుకుగా పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ సూచిక నిఫ్టీ IT ఇండెక్స్‌ను అనుసరిస్తుంది, ఇది 10 ప్రధాన IT కంపెనీలను కలిగి ఉంటుంది.

SBI ETF Nifty IT Index – ప్రత్యేకత ఏంటి..?

SBI ETF Nifty IT Index మదుపరులకు IT రంగంలో దశలవారీగా పెట్టుబడి పెట్టే అవకాశాన్ని అందిస్తుంది. ఇది ప్రత్యేకంగా నిఫ్టీ IT సూచికను అనుసరించి, భారతీయ IT రంగం యొక్క స్థితిగతులకు అద్దం పడుతుంది. ఈ ETF ప్రధానంగా ప్రముఖ IT కంపెనీల షేర్లలో పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది, తద్వారా మదుపరులకు సులభంగా విభిన్నీకరణ చేసే అవకాశం ఉంటుంది.

ఈ ETF సంవత్సర కాలంలో ఇన్వెస్టర్లకు అందించిన రిటర్న్స్ – 28.8%

ఫండ్ 2020 సం ” మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఇచ్చిన యావరేజ్ రిటర్న్స్ – 21.6%

 

ప్రస్తుత ధర: 487.39

52 వారాల గరిష్ఠం : 504.10

52 వారాల కనిష్టం: 341.00

మార్కెట్ క్యాప్: 118 cr

ఫండ్ మేనేజర్లు: Harsh sethi

P/E Ratio: 34.32%

P/B Ratio: 8.33%

Expense Ratio: 0.22%

Top 10 ETF funds 2024 SBI Nifty IT Index ETF

1. ఐటీ index:
SBI ETF Nifty IT Index నిఫ్టీ IT సూచికను అనుసరిస్తుంది. ఇందులో ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), విప్రో తదితర లార్జ్ & మిడ్ క్యాప్ కంపెనీలు ఉన్నాయి, ఇవి భారతీయ IT ఇండెక్స్ కు ప్రాతినిధ్యం వహిస్తాయి.

2. తక్కువ ఖర్చులు:
సాంప్రదాయ మ్యూచువల్ ఫండ్లతో పోలిస్తే, SBI ETFలకు తక్కువ నిర్వహణ ఛార్జీలు ఉంటాయి. ఇది పొదుపు దారులకు ఖర్చు తక్కువతో పెట్టుబడి పెట్టుకునే అవకాశాన్ని ఇస్తాయి అనడంలో సందేహం లేదు.

3. కోనుగోలు / అమ్మకం:
ఈ ETF స్టాక్ ఎక్స్చేంజ్‌లలో నేరుగా కొనుగోలు చేయవచ్చు. డీమ్యాట్ అకౌంట్ లో ఈ Etf షేర్లు క్రెడిట్ అవుతాయి. కాబట్టి షేర్లు, ETF లు కొనాలంటే డీమ్యాట్ అకౌంట్ తప్పని సరిగా కలిగి ఉండాలి. ఒకవేళ లేకపోతే ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఈజీగా పొందవచ్చు. వివరాలకు.. గూగుల్ సెర్చ్ ఇంజిన్/ యూట్యూబ్ లో సెర్చ్ చెయ్యండి.

4. లిక్విడిటీ:
SBI ETFలు అధిక లిక్విడిటీ ( valume )కలిగి ఉంటాయి, అంటే మదుపరులు తక్షణ అవసరాలకు అనుగుణంగా వీటిని విక్రయించవచ్చు.

5. మల్టిపుల్ అసెట్స్:
ఒకే పెట్టుబడితో 10 పెద్ద IT కంపెనీలలో అవకాశం కలుగుతుంది, దీని వల్ల పెట్టుబడిలో నిలకడ, రిస్క్ తగ్గే అవకాశం ఉంటుంది.

IT రంగం ప్రాధాన్యం

భారతదేశంలో IT రంగం వృద్ధి బాగుంది. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవలకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ డిమాండ్ ఉంది. డిజిటల్ టెక్నాలజీ విస్తరణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అంశాలు IT రంగానికి మరింత పటిష్ఠతను తీసుకువస్తున్నాయి.

Top 10 ETF funds 2024 SBI Nifty IT Index ETF

SBI ETF Nifty IT Index లో  పెట్టుబడి వల్ల ఉపయోగాలు

1. స్థిర లాభాలు:
IT రంగం ఆర్థిక మాంద్యం సమయంలో కూడా నిలకడగా పనిచేస్తుంది. దీని కారణంగా మదుపరులకు ఈ ETF లాభదాయకంగా ఉంటుంది.

2. తక్కువ పెట్టుబడి:
పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టలేనివారు కూడా తక్కువ మొత్తంతో ఈ ETFలో పెట్టుబడి పెట్టవచ్చు.

3. టెక్నాలజీ వృద్ధికి అవకాశం:
ఈ ETF టెక్నాలజీ రంగంలోని తాజా మార్పులు, అభివృద్దికి అవకాశం ఉంటుంది. ఇది భవిష్యత్ వృద్ధికి దోహదపడే పెట్టుబడి సాధనంగా మారుతుంది.

4. పనితీరు:
నిఫ్టీ IT సూచిక గత కొన్ని సంవత్సరాలలో గణనీయమైన వృద్ధి సాధించింది. దీని ద్వారా మదుపరులకు మంచి వృద్ధి అవకాశాలు లభిస్తాయి.

ఎవరు పెట్టుబడి పెట్టాలి?

టెక్నాలజీ రంగంపై నమ్మకం కలిగిన వారు.

తక్కువ ఖర్చుతో విభిన్నీకరణ కోరుకునే మదుపరులు.

డిమాండ్ ఉన్న రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడి చేసే ఆసక్తి ఉన్న వారు.

Top 10 ETF funds 2024 SBI Nifty IT Index ETF

SBI ETF Nifty IT Index అనేది భారతీయ IT రంగంలో పెట్టుబడి పెట్టే వారికి సరైన వేదిక. తక్కువ ఖర్చులు, లిక్విడిటీ, మరియు విభిన్నీకరణతో పాటు టెక్నాలజీ రంగం వృద్ధి ప్రయోజనాలను పొందటానికి ఇది ఉత్తమ ఎంపిక. దీర్ఘకాలిక పెట్టుబడులకు సరైన మార్గం కావడంతో, మదుపరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం ఎంతో ఉపయోగకరం.

Disclaimer: పెట్టుబడులకు ముందుగా ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం మంచిది.

 

Top 4 ETF funds కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చెయ్యండి.

https://etfnewstelugu.com/top-etf-funds-2024-hdfc-nifty-smal-cap-250-etf/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ETF News Telugu