ETF News Telugu

Top Silver ETFs 2024

Top Silver ETFs 2024

 

Top Silver ETFs 2024

భారతదేశంలో సిల్వర్ ETF గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం

అనేక సిల్వర్ ETF ఫండ్లు అందుబాటులో ఉన్నాయి, ఇవి నేరుగా వెండి ధరల కనుగుణంగా పనిచేస్తాయి.

సిల్వర్ ETF అంటే ఏమిటి?

సిల్వర్ ETF అనేది స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ అయ్యే ఒక ప్రత్యేకమైన మ్యూచువల్ ఫండ్ లాంటి ఇన్వెస్ట్‌మెంట్ సాధనం. అయితే, సిల్వర్ ETF అనేది వెండి ధరల కదలికను ట్రాక్ చేసే ఒక ఇన్వెస్ట్‌మెంట్ పద్ధతి. ఇది నేరుగా వెండిని కొనుగోలు చేయడం కన్నా, దాని పట్ల చౌకగా, సులభంగా, మరియు సురక్షితమైన అవకాశాన్ని అందిస్తుంది.

దేశంలో సిల్వర్ ETF ప్రవేశం

దేశంలో 2021 డిసెంబర్‌లో SEBI (Securities and Exchange Board of India) ఆమోదం పొందిన తరువాత, సిల్వర్ ETFలు ప్రారంభమయ్యాయి.

Top Silver ETFs 2024

ముందుగా బంగారం (Gold ETFs) కొరకు ఇన్వెస్టర్లకు ఇంట్రెస్ట్ ఉండేది, కానీ  ఇప్పుడు అదే తరహాలో సిల్వర్ ETF లు కూడా మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి.

Edelweiss Mutual Fund మొదటి సిల్వర్ ETFని ప్రారంభించిన సంస్థగా గుర్తింపు పొందింది.

సిల్వర్ ETF ఎలా పనిచేస్తుంది?

సిల్వర్ ETF ను ఫండ్ మేనేజర్లు మార్కెట్‌లో లభ్యమయ్యే వెండిని (Silver Bullion) లేదా వెండి బాండ్లను కొనుగోలు చేసి, దాన్ని తమ షేర్ హోల్డర్స్ పేరు మీద  నిల్వచేస్తారు. మార్కెట్ లో వెండి రేటు మూమెంట్ ఆధారంగా ETF యూనిట్ల విలువ పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.

Top Silver ETFs 2024 :  ప్రయోజనాలు

1. ఈజీ ఇన్వెస్ట్‌మెంట్:

సిల్వర్ ETFలను స్టాక్ మార్కెట్‌లో ఒక సాధారణ షేర్ లాగా కొనుగోలు చేయవచ్చు. ఇన్వెస్టర్లు నేరుగా వెండి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.

సురక్షితం

భౌతికంగా వెండిని నిల్వచేసినప్పుడు వచ్చే రిస్క్‌లను (దొంగతనం, నాణ్యత ప్రమాణాలు తదితర రిస్కులను ) ఇది నివారిస్తుంది.స్మాల్

చిన్న మొత్తంలో పెట్టుబడి

నేరుగా వెండి కొనుగోలు చేయడం ఖరీదైన పని. కానీ సిల్వర్ ETFలో మినిమం ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా షేర్ పొందవచ్చు.

 

పరిశ్రమ వినియోగం

4. దేశంలో సిల్వర్ వినియోగం పై అంచనాలు పెరుగుతున్నాయి. సిల్వర్ ప్రస్తుతానికి పరిశ్రమలలో మరియు భవిష్యత్ టెక్నాలజీ అవసరాల్లో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి దీని ధర పెరుగుతుందనే అంచనా ఉంది.

ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు పరిగణించాల్సిన విషయాలు

సిల్వర్ ను బంగారంతో పోల్చి చూస్తే కనుక.. బంగారానికి చాలా స్థిరమైన మార్కెట్ ఉంది, సిల్వర్ కి మాత్రం ధరలు కొంచెం ఎక్కువ ఒడిదొడుకులకు గురవుతుంది. కాబట్టి ఇది కొంతమంది ఇన్వెస్టర్లకు రిస్కీగా అనిపించవచ్చు.

సిల్వర్ ETFలకు చిన్న మొత్తంలో మేనేజ్‌మెంట్ ఫీజులు ఉంటాయి. ఇది దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్లు  చేసే ఇన్వెస్టర్ లపై కొంత ప్రభావం చూపవచ్చు.

మార్కెట్ పై అవగాహన ముఖ్యం

సిల్వర్ ETFలో ఇన్వెస్ట్ చేసే ముందు మార్కెట్ ట్రెండ్స్ గురించి అధ్యయనం చేయడం మంచిది. స్టాక్ మార్కెట్ పెరుగుతున్న సమయంలో లేదా అంతర్జాతీయ పరిణామాలు, పరిశ్రమ డిమాండ్ సప్లయి ఆధారంగా హెచ్చు తగ్గులు ఉండొచ్చు. ఇన్వెస్టర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

సిల్వర్ ETFల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది..?

దేశంలో మౌలిక వృద్ధి, వెండిపై పరిశ్రమలలో పెరుగుతున్న డిమాండ్, మరియు ఇన్వెస్టర్ల దోరణి మారుతున్న  కారణంగా సిల్వర్ ETFలకు మంచి భవిష్యత్తు ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

వెండి ధరలు అధికంగా మారే అవకాశాలున్నాయి, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు దీనిని ఒక అధికాదాయ ఇన్వెస్ట్మెంట్ గా చూడొచ్చు.

మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిల్వర్ ETFలు వాటి గత సంవత్సరం రాబడులు:

 

Top Silver ETFs 2024

A. Edelweiss Silver ETF:

ఇది మొదటిగా ప్రారంభమైన ETF. ఇది అత్యధిక స్థాయి వెండిని ట్రాక్ చేస్తుంది.

B. ICICI Prudential Silver ETF:

ఇది మంచి లిక్విడిటీ కలిగిన ఫండ్. దీని నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుంది.

 

Top Silver ETFs 2024

1. Nippon India Silver ETF

ప్రస్తుత ధర : 87.30

52 వారాల పెరుగుదల : 100.00

52 వారాల తగ్గుదల : 67.00

ప్రారంభం: ఫిబ్రవరి 2022

గత ఏడాది రాబడి: 25.72%

మొత్తం ఆస్తులు (AUM): ₹5,214 కోట్లు

Expense Ratio: 0.56%.

 

2. ICICI Prudential Silver ETF

ప్రస్తుత ధర : 90.73

52 వారాల పెరుగుదల : 101.00

52 వారాల తగ్గుదల : 68.65

ప్రారంభం: జనవరి 2022

గత ఏడాది రాబడి: సుమారుగా 20-22%

మొత్తం ఆస్తులు (AUM): ₹3,714 కోట్లు

 

3. HDFC Silver ETF

ప్రస్తుత ధర : 87.40

52 వారాల పెరుగుదల : 100.35

52 వారాల తగ్గుదల : 67.85

ప్రారంభం: సెప్టెంబర్ 2022

మొత్తం ఆస్తులు (AUM): ₹320.58 కోట్లు

 

4. Axis Silver ETF

ప్రస్తుత ధర : 90.80

52 వారాల పెరుగుదల : 103.18

52 వారాల తగ్గుదల : 70.25

ప్రారంభం: 2022

మొత్తం ఆస్తులు (AUM): ₹136.98 కోట్లు.

 

5. DSP Silver ETF

ప్రస్తుత ధర : 88.30

52 వారాల పెరుగుదల : 98.60

52 వారాల తగ్గుదల : 68.00

ప్రారంభం: ఆగస్టు 2022

మొత్తం ఆస్తులు (AUM): ₹231.11 కోట్లు

 

Expense Ratio: 

తక్కువ ఖర్చులతో వెండి నిల్వ సమస్యలను అధిగమించేలా ఈ ETF లు తయారు చేయబడ్డాయి.

నేరుగా వెండి ధరలపై ఆధారపడి నిలకడగా రాబడులు అందిస్తోంది. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటాయి.

1. ఈ సిల్వర్ ETFలు నేరుగా ఫిజికల్ సిల్వర్ కొనుగోలుకు ప్రత్యామ్నాయంగా, సెక్యూర్ గా ఉండే విధంగా ఆన్లైన్ కొనుగోళ్లను ప్రోత్సహించటం ప్రభుత్వ ముఖ్య ఉద్ధేశం.

2. ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టే ముందు  ట్రాకింగ్ ఎర్రర్స్, మార్కెట్ పరిస్థితులు, మరియు పెట్టుబడి లక్ష్యాలను పరిశీలించడం చాలా అవసరం.

సిల్వర్ ETFలు ఇన్వెస్టర్లకు ఒక కొత్త అవకాశాన్ని కలగజేస్తున్నాయి.

సిల్వర్ ETFలు ఎక్కువ డిమాండ్ ఉన్న వెండి పరిశ్రమలో పెట్టుబడులను ఆహ్వానించడంలో గొప్ప సాధనంగా మారాయి. దీర్ఘకాలంలో మంచి రాబడుల కోసం ఈ ETF లు అనుకూలం.

సిల్వర్ ETF లు వెండి పై నమ్మకం ఉన్నవారికి భౌతిక రూపంలో ఇన్వెస్ట్ చేయకుండా ఈజీగా ఇన్వెస్ట్ చేసుకునే మంచి మార్గమనే చెప్పాలి.

అయితే, దీని రిస్క్-రివార్డ్ రేషియో, మార్కెట్ పరిస్థితులు, మరియు వ్యక్తిగత పెట్టుబడి లక్ష్యాలను బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం కోసం నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ETF News Telugu