Demat account for Etf investment :
డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చెయ్యాలి..?
ఈ టి ఎఫ్ ఇన్వస్ట్ మెంట్ కోసం మొదటగా డీమ్యాట్ & ట్రేడింగ్ అకౌంట్ అనేవి అవసరం. వాటిని స్టాక్ మార్కెట్ బ్రోకరేజి దగ్గర ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదేమంత కష్టమైన పనేమీ కాదు.
ఉదాహరణ: ఆన్లైన్ ద్వారా అకౌంట్ సులువుగా ఓపెన్ చేసుకోవచ్చు.
Demat account for Etf investment
బ్రోకరేజీల వివరాలు: Zerodha kite , Upstox , Fyers , 5 Paisa , Angel one , మొదలగునవి ఆన్లైన్ ద్వారా అకౌంట్ ఓపెనింగ్ చేసుకునే వెసులు బాటు కల్పిస్తున్నాయి.
ఇవే కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్ర బ్యాంక్ , హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ , ఐ సి ఐ సి ఐ బ్యాంక్ , యాక్సిస్ బ్యాంక్ , తదితర గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులలో కూడా డీమ్యాట్ & ట్రేడింగ్ అకౌంట్ లను ఓపెన్ చేసుకోవచ్చు.
ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ మధ్య యాన్యువల్ మెయింటనన్స్ ఛార్జీలలో కొంచెం తేడా గమనించాల్సి ఉంటుంది.
Demat account for Etf investment
Online : కొన్ని ఆన్లైన్ బ్రోకరేజ్ డీలర్స్ ” సున్నా ” మెయింటెనెన్స్ తో అకౌంట్ లను ఓపెన్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తాయి. కొన్ని మాత్రం నామినల్ చార్జీలను వసూలు చేస్తున్నాయి.
Off-line : ఆఫ్లైన్ లో మాత్రం చాలా వరకు బ్యాంకులే ఈ అకౌంట్ లను వారి కస్టమర్లకు ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో ఓపెన్ చేసుకుంటే మాత్రం యాన్యువల్ చార్జీలు ఉంటాయి.
Demat account for Etf investment
Account opening: అకౌంట్ ఓపెనింగ్ కి కావలసిన పత్రాలు..
1. పాన్ కార్డు
2. ఆధార్ కార్డు
ఉంటే సరిపోతుంది.
ఫోటో మాత్రం.. ఆన్లైన్ అప్లికేషన్ నింపే క్రమంలోనే ఫోన్ ఫ్రంట్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసుకుంటుంది.